Pawan Kalyan : జనసేన 12వ ఆవిర్భావ సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహుభాష విధానం పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులోని అధికార డీఎంకే నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీని వ్యతిరేకించేవారు తమ సినిమాలను హిందీలోకి ఎందుకు డబ్ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్‌లో కూడా పలువురు పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Virat Kohli: టీ20 రిటైర్మెంట్‌పై విరాట్ కోహ్లీ యూ టర్న్.. కారణమిదే?
“తాను హిందీ భాషను ఎప్పుడూ వ్యతిరేకించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. దాన్ని నిర్భందంగా అమలు చేయడాన్నే వ్యతిరేకించానని” ట్వీట్ చేశారు. NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదని, కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రతి భారతీయుడికి భాషా స్వేచ్ఛ, విద్యా ఎంపిక అనే సూత్రానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో రాజకీయ అజెండాల కోసం ఈ విధానాన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకున్నాడంటూ తప్పుడు ప్రచారం చేయడం.. అవగాహన లేమిని ప్రతిబింబిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను డీఎంకే నేత ఇళంగోవన్ తోసిపుచ్చారు. 1938 నుంచి హిందీ భాషపై తమిళనాడు రాష్ట్రానికి ఉన్న దీర్ఘకాలిక వ్యతిరేకతను డీఎంకే నేత ఇళంగోవన్ గుర్తు చేశారు. ఇప్పుడు కాదు.. 1938 నుంచి హిందీని వ్యతిరేకిస్తున్నాం. తమిళనాడు ఎప్పుడూ ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుంది. కానీ నటులను కాదు. విద్యా నిపుణుల సలహాలు, సూచనలతోనే రాష్ట్ర అసెంబ్లీలో చట్టం చేశాం. 1968లో ఈ బిల్లు ఆమోదం పొందిందన్నారు.
Read Also: Pregnant Women: గర్భిణీ స్త్రీలు గంగానదిలో స్నానం చేయవచ్చా లేదా?