Pawan Kalyan Election campaign : వరంగల్ లో పవన్ ఎన్నికల ప్రచారం..ఫుల్ జోష్ లో బిజెపి , జనసేన

ఈ నెల 22 న పవన్ కళ్యాణ్ వరంగల్ (Warangal)లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు

Published By: HashtagU Telugu Desk
Pawan Speech

Pawan Speech

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రంగంలోకి దిగబోతున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Polls) బిజెపి (BJP) తో కలిసి జనసేన (Janasena) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి మద్దతు తెలుపుతుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ..బిజెపి , జనసేన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయబోతున్నారు.

ఈ నెల 22 న పవన్ కళ్యాణ్ వరంగల్ (Warangal)లో ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. బీజేపీ వరంగల్ పశ్చిమ అభ్యర్థి రావు పద్మ(Rao Padma) కు మద్దతుగా ప్రచారంలో పాల్గొనున్న పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ చరిష్మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు.

అలాగే ఈనెల 26వ తేదీన పవన్ కళ్యాణ్ కూకట్ పల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుండి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ప్రచారం జరుపుతారని రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Read Also : Hyderabad: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో జర్నలిస్టు ఆత్మహత్య

  Last Updated: 20 Nov 2023, 03:17 PM IST