Pawan Kalyan : బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్.. బిజెపి నేతలను నిరాశ పరిచాడా..?

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) BRS ఫై, CM KCR ఫై ఎన్నో విమర్శలు చేస్తాడని.. అవన్నీ BJP కి మేలు కలిగిస్తాయని అనుకున్నారు.

  • Written By:
  • Updated On - November 8, 2023 / 12:27 PM IST

Pawan Kalyan at BC Atma Gourava Sabha : తెలంగాణ ఎన్నికల ప్రచార (Telangana Election Campaign) వేడి తారాస్థాయి లో ఉంది. అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS).. కాంగ్రెస్ (Congress) పార్టీలు నువ్వా నేనా అనేంతగా హోరా హోరీగా ప్రచారం చేస్తున్నారు. విమర్శలు , ప్రతివిమర్శలు చేసుకుంటూ ప్రజల్లో ఆసక్తి కనపరుస్తున్నారు. ఈ తరుణంలో బిజెపి (BJP) సైతం తన దూకుడు పెంచాలని ప్లాన్ చేసింది. అందులో భాగంగా హైదరాబాద్ లో మంగళవారం బీసీ ఆత్మ గౌరవ సభ (BC Atma Gourava Sabha) ఏర్పాటు చేసి ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ప్రధాని మోడీ (Modi) తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరయ్యారు.

బిజెపి – జనసేన పొత్తు (BJP – Janasena) అనేది ఎప్పటి నుండో కొనసాగుతూ వస్తున్నదే. 2014 ఎన్నికల తో పాటు.. GHMC ఎన్నికల్లోనూ బిజెపి తో జనసేన పొత్తు కుదుర్చుకొని ప్రచారం చేసింది. ఇక ఈ ఎన్నికల్లో కూడా అలాగే పొత్తు పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తుంది. ఈ క్రమంలో బిజెపి ఏర్పటు చేసిన బిసి సభ కు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను రావాల్సిందిగా బిజెపి కోరింది. బిజెపి కోరిక మేరకు పవన్ కళ్యాణ్ హాజరయ్యాడు. పవన్ రాకతో సభఫై జనాల్లో మరింత ఆసక్తి ఏర్పడింది.

We’re now on WhatsApp. Click to Join.

ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ (Pawan Speech) ప్రసంగాలు ఎలా ఉంటాయో తెలియంది కాదు..జగన్ ఫై మాటల తూటాలు పేలుస్తూ చెమటలు పట్టిస్తుంటాడు. దీంతో బీసీ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమాట్లాడతారో..అధికార పార్టీ ఫై ఎలాంటి నిప్పులు చెరుగుతారో..కేసీఆర్ ఫై ఎలాంటి మాటల తూటాలు పేలుస్తారో అని అంత ఎదురుచూసారు. గతంలో వరంగల్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కేసీఆర్ ను తాటతీస్తా అంటూ భారీ సినిమా డైలాగ్ పేల్చి వార్తల్లో నిలిచారు. పవన్ అన్న ఆ డైలాగ్ ను కేసీఆర్ తనదైన రాజకీయ అనుభవంతో వాడుకొని ఓట్లుగా మార్చుకున్నారు. మరి ఇక ఇప్పుడు పవన్ ఏమాట్లాడతారో అని బిఆర్ఎస్ నేతలు , శ్రేణులు సైతం ఆసక్తి కనపరిచారు.

కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆచితూచి మాట్లాడి అందరికి షాక్ ఇచ్చాడు. ముఖ్యంగా బిజెపి నేతలను నిరాశ పరిచాడనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ బిఆర్ఎస్ ఫై , సీఎం కేసీఆర్ ఫై ఎన్నో విమర్శలు చేస్తాడని..అవన్నీ బిజెపి కి మేలు కలిగిస్తాయని అనుకున్నారు. కానీ పవన్ మాత్రం బిఆర్ఎస్ , కాంగ్రెస్ , సీఎం కేసీఆర్ ఇలా ఎవరి ఫై కూడా ఎలాంటి విమర్శలు , కౌంటర్లు వెయ్యలేదు. కేవలం మోడీ ఫై ప్రశంసలు మాత్రం కురిపించారు.

Also Read:  AP : రాబోయే రోజుల్లో ఏపీలో ‘జైలర్’ సినిమా కనిపించబోతుంది – RRR

మోదీ అధికారంలోకి వచ్చాకే ఉగ్రదాడులు నియంత్రించగలిగారని అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీలు. మోదీ ప్రభుత్వం బీసీలను నోటితో చెప్పి ప్రేమించలేదని, సీటుతో ఇచ్చి ప్రేమించిందని అన్నారు. మాటలతో కాకుండా, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రేమించిందని అన్నారు.

‘‘ప్రధాని మోడీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదు. మోడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్ 370, నోట్ల రద్దు చేసేవారు కాదు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి. మోడీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలి. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే మోడీ. మోడీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ’’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

పవన్ స్పీచ్ తర్వాత చాలామంది ఆలోచనలో పడ్డారు. పవన్ ఎందుకు ఆచితూచి మాట్లాడారు..దీనికి కారణం ఏంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో జనసేన 8 స్థానాల్లో పోటీ చేస్తుంది కదా..ఆ ప్రచారంలో ఏమైనా అధికార పార్టీ ఫై మాట్లాడతారేమో అని కార్యకర్తలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మాత్రం పవన్ ఈసారి తన దూకుడు ను తగ్గించి మాట్లాడారు అనేది వాస్తవం.

Read Also : KCR – Telangana Gandhi : ‘తెలంగాణ గాంధీ’ అంటూ కామెంట్స్ చేసిన పోసాని