Basara Protest : బాస‌ర త్రిపుల్ ఐటీపై ప‌వ‌న్, రేవంత్

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ లీడ‌ర్లు వాలిపోతున్నారు. బాస‌ర త్రిపుల్ ఐటీ విద్యార్థుల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గోడ‌దూకారు.

  • Written By:
  • Publish Date - June 18, 2022 / 04:15 PM IST

ఎన్నిక‌ల స‌మీపిస్తోన్న వేళ స‌మ‌స్య ఎక్క‌డ ఉంటే అక్క‌డ లీడ‌ర్లు వాలిపోతున్నారు. బాస‌ర త్రిపుల్ ఐటీ విద్యార్థుల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గోడ‌దూకారు. విద్యార్థుల 12 డిమాండ్ల‌ను కేసీఆర్ స‌ర్కార్ ప‌రిష్క‌రించాల‌ని ప‌వ‌న్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు 12 డిమాండ్ల సాధన కోసం నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ వీసీ లేకపోవడాన్ని ప్ర‌ధాన స‌మ‌స్య‌గా వాళ్లు చెబుతున్నారు. అంతేకాదు, విద్యా సంవ‌త్స‌రం ప్రారంభ‌మైన‌ప్ప‌టికీ ల్యాప్ టాప్ లు, యూనిఫాం ఇవ్వడంలేదని అంటున్నారు. సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ క్యాంపస్ కు రావాల్సిందేనని గత కొన్నిరోజులుగా నిరసనలు కొనసాగిస్తున్నారు. దీనిపై జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఓ ప్రకటనలో కోరారు. ట్రిపుల్ ఐటీలను ఏ లక్ష్యం కోసం స్థాపించారో దాన్ని నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు.

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలికింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి వెళ్లారు. పోలీసులను ఏమార్చి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించి కొంతదూరం ట్రాక్టర్ లో ప్రయాణించారు. ఆపై పొలాల్లో కాలినడకన ఐఐఐటీ వద్దకు చేరుకున్నారు. ఇలాంటి ఫీట్ల‌ను రేవంత్ గ‌తంలోనూ ఛ‌లో ప్ర‌గ‌తిభ‌వ‌న్ సంద‌ర్భంగా చేసిన విష‌యం విదిత‌మే. త్రిపుల్ ఐటీ విద్యార్థులకు అండ‌గా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన జ‌న‌సేనా త్వ‌ర‌లోనే క్యాంప‌స్ లోకి ఎంట్రీ ఇస్తార‌ని జ‌న‌సైనికులు భావిస్తున్నారు. గోడ‌దూకి వెళ్లిన రేవంత్ కు ధీటుగా ప‌వ‌న్ వ‌స్తార‌ని క్యాంప‌స్ లోని టాక్‌. అందుకోసం ప్రీ రిలీజ్ లాగా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశార‌ని చెబుతున్నారు. కానీ, టీఆర్ఎస్ పార్టీతో స‌న్నిహితంగా ఉంటోన్న ప‌వ‌న్ విద్యార్థుల‌కు అండ‌గా ఉండ‌డానికి క్యాంపస్ కు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ఏదేమైనా ఆయన విడుద‌ల చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ కు ధీటుగా అనే టాక్ ఉంది.