Pawan Kalyan Alliance BRS : కేసీఆర్ ను గెలిపించేందుకు పవన్ భారీ స్కెచ్..?

కేసీఆర్ కోసం, మున్నూరు కాపుల ఓట్లను చీల్చడం కోసమే పోటీ చేస్తున్నాడని పేర్ని నాని కామెంట్స్ చేసారు. తెలంగాణాలో లాగా ఏపీలో కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా..? పొత్తు ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు

Published By: HashtagU Telugu Desk
Nani Janasena Ts

Nani Janasena Ts

తెలంగాణ లో మరోసారి కేసీఆర్ (KCR) ను గెలిపించేందుకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భారీ స్కెచ్ వేశారని అన్నారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani). తెలంగాణ లో మరో రెండు నెలల్లో ఎన్నికలు (Telangana Elections 2023) రాబోతున్నాయి. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. అభ్యర్థుల ప్రకటన , ఎన్నికల మేనిఫెస్టో , ప్రచారం ఇలా అన్ని సిద్ధం చేస్తున్నాయి. ఇదే క్రమంలో జనసేన కూడా తెలంగాణ లో 32 స్థానాల్లో (Janasena 32 Constituencies) పోటీ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించింది. ఈ 32 స్థానాలకు సంబదించిన వివరాలను కూడా తెలిపింది. అయితే తెలంగాణాలో జనసేన పోటీ చేయడం ఫై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని పలు కామెంట్స్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం కేసీఆర్‌ ను గెలిపించేందుకే తెలంగాణలో పవన్ పోటీ చేస్తున్నాడని పేర్ని నాని విమర్శలు చేశారు. తెలంగాణలో మున్నూరు కాపులు ఉన్న చోటే జనసేన అభ్యర్థులను బరిలోకి దింపాడని..ఆలా ఎందుకు దింపాల్సి వచ్చింది పవన్ ? అని ప్రశిచారు. కేసీఆర్‌ కోసం, మున్నూరు కాపుల ఓట్లను చీల్చడం కోసమే పోటీ చేస్తున్నాడని పేర్ని నాని కామెంట్స్ చేసారు. తెలంగాణాలో లాగా ఏపీలో కూడా ఒంటరిగా పోటీ చేయొచ్చు కదా..? పొత్తు ఎందుకు అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీతో సంప్రదించే అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పావా..? ఎన్డీఏలో ఉండి హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ఎరికి మద్దతిచ్చావ్‌ పవన్‌..? అని నిలదీశారు. ఏపీలో కాపుల ఓట్లున్న చోటే వారాహి యాత్రలు ఎందుకు చేస్తున్నావ్‌.. అంటూ మండిపడ్డారు పేర్ని నాని. పవన్ ఐదు రోజుల పాటు కృష్ణాలో ఆటవిడుపు యాత్ర చేశారని ఎద్దేవా చేసాడు నాని. మరి పేర్ని నాని వ్యాఖ్యలపై తెలంగాణ జనసేన నేతలు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Read Also : Delhi Pollution: కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రణాళికలు

  Last Updated: 07 Oct 2023, 12:33 PM IST