Telangana Polls : జనసేన అభ్యర్థులకు బి ఫారాలు అందజేసిన పవన్

బుధువారం హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో బి ఫారాలు అందజేసి అల్ ది బెస్ట్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు పవన్.

Published By: HashtagU Telugu Desk
Janasena B Pharms

Janasena B Pharms

తెలంగాణ ఎన్నికల (Telangana Polls) బరిలో జనసేన పార్టీ (Janasena) 8 స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న మంగళవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూకట్ పల్లి, రంగారెడ్డి జిల్లాలో తాండూరు, నల్గొండ జిల్లాలో కోదాడ, మహబూబ్ నగర్ జిల్లాలో నాగర్ కర్నూల్, ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

కోదాడ నియోజకవర్గం నుంచి మేకల సతీశ్ రెడ్డి, ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్, వైరా నుంచి సంపత్ నాయక్, కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు, కూకట్‌పల్లి నుంచి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి శంకర్ గౌడ్, అశ్వారావు పేట నుంచి మూగబోయిన ఉమాదేవి లు జనసేన తరుపున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరందరికి బుధువారం హైదరాబాద్ లోని జనసేన ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బి ఫారాలు (B-Form) అందజేసి అల్ ది బెస్ట్ తెలిపారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ని గెలిపించాలని ఈ సందర్బంగా ఓటర్లను కోరారు పవన్.

Read Also : Rekha Naik : కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రేఖా నాయక్

  Last Updated: 08 Nov 2023, 07:31 PM IST