లగచర్లలో అధికారులపై దాడి కేసులో కొడంగల్ మాజీ MLA పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy )కి హైకోర్టులో స్వల్ప ఊరట (Big Relief) లభించింది. లగచర్ల ఘటనలో తనపై బొంరాస్ పేట పోలీస్ స్టేషన్ లో మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయడాన్ని నరేందర్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు శుక్రవారం నాడు తీర్పును వెల్లడించింది. నరేందర్ పై ఉన్న 3 FIRలలో రెండింటిని కొట్టివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే ఘటనపై 3 FIRలు నమోదు చేశారని నరేందర్రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇక దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటును నిరసిస్తూ లగచర్ల గ్రామస్థులు రైతులు గత కొద్దీ రోజులుగా ఆందోళలనలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సహా ఇతర అధికారులపై గ్రామస్తులు ఈ నెల 11న దాడికి యత్నించారు. ఈ ఘటనలో కలెక్టర్ సహా ఇతర అధికారులను పోలీసులు రక్షించారు. అధికారి వెంకట్ రెడ్డిపై గ్రామస్తులు దాడి చేశారు.ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీ సహా ఇతర అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ ఘటన వెనుక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హస్తం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఏ 1 నిందితుడిగా బి. సురేశ్ ను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఈ ఘటన కు రాజకీయ రంగు పులుముకుంది. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం గిరిజన రైతుల భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. ఎకరానికి రూ. 50 నుంచి 60 లక్షలు ధర పలికే భూములకు కేవలం రూ. 10 లక్షలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
Read Also : Vidaamuyarchi : సంక్రాంతి బరిలో ఇంకో స్టార్ హీరో సినిమా.. అజిత్ ‘విడాముయర్చి’ టీజర్ రిలీజ్..