Patnam Mahender Reddy: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం, తొలి ఫైల్ పై సంతకం

పట్నం మహేందర్ రెడ్డి ఇవాళ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు.

Published By: HashtagU Telugu Desk
Patnam

Patnam

Patnam Mahender Reddy : డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయం మొదటి అంతస్తులో పూజల అనంతరం ఐ&పీఆర్,భూగర్భ  వనరుల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు మహేందర్ రెడ్డి. చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఐఎన్పిఆర్ కమిషనర్ అశోక్ రెడ్డి ముందు ఉంచిన తొలి ఫైల్ పై సంతకం చేశారు. మహేందర్ రెడ్డి. కుటుంబ సభ్యులు వికారాబాద్ జెడ్పి చైర్ పర్సన్ పట్నం సునీత రెడ్డి, కుమారుడు పట్నం రినీష్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేలు పట్నం నరేందర్  రెడ్డి,మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రకాష్ గౌ,డ్ కాలే యాదయ్య, కృష్ణారావు, బల్కా సుమన్, ఎమ్మెల్సీ శంగిపూర్ రాజు, ప్రసకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్టులు హజారీ, మారుతి సాగర్, బసవ పున్నయ్యలు కూడా మహేందర్ రెడ్డి (Patnam Mahender Reddy) కి శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ తొలి కేబినెట్ మంత్రిగా పనిచేసిన పట్నం, రెండోసారి కూడా మంత్రిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నారు.

అయితే తాండూరు లో ఎమ్మెల్యే పైలట్, మహేందర్ రెడ్డి మధ్య టికెట్ కోసం తీవ్ర పోటీ ఉండటంతో కేసీఆర్ కేబినెట్ లో చోటు కల్పించారు. ఆయన పదవీ కాలం 3 మూడు నెలల కావడం గమనార్హం. అయితే మహేందర్ రెడ్డికి మంత్రి పదవీ కట్టబెట్టడంతో రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) కొంత మేర పుంజుకునే అవకాశాలున్నాయి.

Also Read: Tamilisai: చంద్రుడ్నే కాదు.. సూర్యుడ్ని కూడా చేరుకుంటాం: రక్షాబంధన్ వేడుకల్లో తమిళి సై

  Last Updated: 30 Aug 2023, 04:50 PM IST