Site icon HashtagU Telugu

Telangana: బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ ని కలిసిన పట్నం ఫ్యామిలీ

Telangana

Telangana

Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. రాష్ట్రంలో తిరుగులేదనుకున్న కారు పార్టీకి బిగ్ షాకిచ్చారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ఆ పార్టీ నుంచి రోజుకో నాయకుడు బయటకొస్తున్నారు. గ్రామస్థాయిలోనూ ఇదే పరిస్థితి. ఇప్పటికే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ పార్టీకి గుడ్ చెప్పారు. ఇప్పుడు మరో కీలక నేత పార్టీ నుంచి తప్పుకోకున్నారు.

బీఆర్‌ఎస్ సీనియర్ నేత పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీత మహేందర్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో ఈ జంట కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తుంది. మహేందర్ రెడ్డి ఆగస్టు 2023 నుంచి డిసెంబర్ వరకు గత ప్రభుత్వం కేసీఆర్ కేబినెట్‌లో గనులు మరియు భూగర్భ శాస్త్రం, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రిగా మరియు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.ప్రస్తుతం ఆయన శాసన మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు.

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మార్పు అనేది సహజం. అయితే తెలంగాణలో బలమైన పార్టీగా పేరొందిన బీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు చేరికలు కొనసాగుతుండటం ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తుంది. నేతలని కేసీఆర్ కాపాడుకోవడంలో విఫలమవుతున్నరా అన్న సందేహం కలుగుతుంది.

Also Read: Health: నులిపురుగులతో జర జాగ్రత్త, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు