రాష్ట్ర ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్యాబినేట్ (KCR Cabinet) ను ఈ నెల 24న విస్తరించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి వర్గ విస్తరణలో రంగారెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డికి మరో మారు స్థానం దక్కనుంది. మంత్రిగా మహేందర్ రెడ్డి రెండవసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తొలి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా 2 జూన్ 2014న ఆయన సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి పదవి ప్రమాణస్వీకారం చేసి 8 జూన్ 2014న బాధ్యతలను చేపట్టారు.
అనంతరం 2018 వరకు మంత్రి గా ఆయన కొనసాగారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాల అనంతరం మహేందర్ రెడ్డి కి అప్పటి టిఆర్ఎస్ పార్టీ అధినేత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఎంఎల్సీగా ఉండి కొడంగల్ లో ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్ రెడ్డి స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో05.02.22 ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అప్పటినుండి రంగారెడ్డి జిల్లాతో పాటు తాండూర్ రాజకీయాల్లో ఆయన చురుకుగా ఉన్నారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పగల సత్తా ఉన్న మహేందర్ రెడ్డికి అధినేత మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించారు. ఇలా మహేందర్ రెడ్డి రెండో సారి 24 న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Also Read: MLC Kavitha: మహిళలపై బీజేపీ దాడి సరైంది కాదు, ట్విట్టర్ లో కవిత హితవు!