Gudem Mahipal Reddy : తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కేవలం 15 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) HashtagU కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. దేశంలో ప్రధాని ఎవరన్న విషయంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని.. BRS కు వంద సీట్లు పక్కా వస్తాయని భరోసా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు జెండా.. ఎజెండా రెండూ లేవని ఆరోపించారు. ఓ కార్మిక నేత గా ప్రారంభించిన తన రాజకీయ ప్రస్ధానంలో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యానని..తెలంగాణ వచ్చాక ప్రణాళికాబద్దంగా పటాన్ చెరులో కాలుష్యం రూపుమాపేందుకు శ్రమించానని అన్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు. 2 వేల కోట్ల ఆస్తిని ఇప్పుడు సంపాదించినది కాదని .. తాతల నాటి భూముల విలువ పెరిగిందన్నారు. దమ్మున్నోళ్లు నిరూపిస్తే రాజకీయల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఇటీవల TRS నేత నీలం మధు తనకే టిక్కెట్ వస్తుందన్న కామెంట్స్ ను కొట్టిపారేశారు. తాను నియోజకవర్గంలో చేసే సేవా కార్యక్రమాలు ఓట్లు కోసం కాదని HashtagU కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూని చూడండి.
Also Read: Pawan trip to Delhi: పవన్ ఢిల్లీ పర్యటన తుస్! అంతా సినిమాటిక్!!