Site icon HashtagU Telugu

Bandi Sanjay : కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలి – బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ ప్రజల సొమ్మును దోచుకుతిన్న కేసీఆర్ ( KCR ) కుటుంబం సహా బీఆర్ఎస్ ( BRS ) నాయకుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని లేకపోతే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay Kumar ) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ విస్త్రత సమావేశం శనివారం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌ ఎన్నికలపై నేతలకు బండి సంజయ్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్ పోర్టులు సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే అందరూ దేశం దాటి పారిపోయే ప్రమాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

‘కేసీఆర్ మినహా ఓడిపోయిన ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులంతా అవినీతి, అరాచకాలకు పాల్పడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుతిన్నారు. వెంటనే వాళ్ల అవినీతిని బయటపెట్టాలి. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. అంతకంటే ముందే వాళ్ల పాస్ పోర్టులన్నీ రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేయాలి. లేకుంటే విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉంది. వీరితోపాటు ఇన్ని అరాచకాలకు కారకులైన కేసీఆర్ సీఎంగా ఉండగా సీఎంఓలో పదవీ విరమణ చేసిన అధికారులు అడ్డగోలుగా సంపాదించి ప్రజల ఆస్తులను దోచుకుని తెలంగాణను సర్వనాశనం చేశారు. వాళ్ల పాస్ పోర్టును కూడా స్వాధీనం చేయాలి. కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నందున ఆరోగ్యం కుదటపడే వరకు ఈ విషయంలో ఆయనను మినహాయించాలి’’అని బండి సంజయ్ చెప్పుకొచ్చారు.

ఇక నెలాఖరులో 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఎర్జు జరిగిన సమావేశానికి కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఆ పైస్థాయి నాయకులంతా హాజరయ్యారు.

Read Also : Nagababu : ఏపీలో నాగబాబు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఫై వైసీపీ ఆగ్రహం