Site icon HashtagU Telugu

Viral : ఏకంగా ఆర్టీసీ బస్సులోనే మందేస్తూ చిందేసిన ప్రయాణికులు..

Bus Win

Bus Win

TSRTC బస్సులో ఏకంగా మద్యం తాగుతూ చిందులేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చి రాగానే మహిళకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. ఇక మేడారం జాతర కు వెళ్లే బుస్సులోను ఫ్రీ అమలు చేయడం తో గతంతో కంటే ఈసారి మహిళలు పెద్ద ఎత్తున మేడారం కు వెళ్లడం జరిగింది. కాగా మేడారం జాతరకు వెళ్లే బస్సులో కొంతమంది ప్రయాణికులు మద్యం తాగుతూ కనిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబదించిన వీడియో మాత్రం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చుట్టూ మహిళా ప్రయాణికులు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా వైన్ షాప్ లో ఎలాగైతే మద్యం సేవిస్తారో అలా..ప్రభుత్వ బస్సు లో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేసారు. మరి ఇంత జరుగుతున్న సదరు డ్రైవర్ కానీ , కండక్టర్ కానీ పట్టించుకోలేదా అనేది అర్ధం కావడం లేదు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఏమైనా స్పందిస్తారా అనేది చూడాలి.

Read Also : Pawan Kalyan : పవన్ ఎక్కడి నుండి పోటీ చేయాలో ఇంకా డిసైడ్ కాలేదా..?