Site icon HashtagU Telugu

Raja Singh : పార్టీ నిబంధనలు ఉల్లంఘించలేదు.. దేశ సేవ చేసే ఛాన్స్ ఇవ్వండి: బీజేపీకి రాజాసింగ్ లేఖ..!

Rajasingh

Rajasingh

బీజేపీ తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై గోషామాహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాశారు. ఏనాడు తాను పార్టీ నిబంధనలకు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా…పార్టీలో ఉంటూ దేశానికి సేవ చేసే ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కేవలం మునావర్ ఫారుఖీ అనుకరించాను తప్పా ఏ మతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ తాను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని రాజాసింగ్ లేఖలో పేర్కొన్నారు.

కాగా పీడియాక్ట్ పై జైల్లో ఉన్న రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. రాజాసింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై 15రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కోరడంతో తన వాదన వినిపిస్తూ బీజేపీ డిసిప్లినరీ కమిటీకి లేఖ రాశారు రాజాసింగ్. మరి ఈ లేఖతో బీజేపీ నాయకత్వం రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ వేటు తొలగిస్తుందో లేదా చూడాల్సిందే.