President Murmu: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతా : రాష్ట్రపతి ముర్ము

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Published By: HashtagU Telugu Desk
President

President

బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌ కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సామాన్యుల నుంచి సెలబ్రిటీ లవరకు పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాజాగా రాష్ట్రపతి ముర్ము కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి తెలుసుకున్నారు. మొక్కలు నాటడం అంటే తనకు చాలా ఇష్టమని, వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉన్నా, మొక్కల పెంపకానికి తాను సమయం కేటాయిస్తానని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈసారి హైదరబాద్ వచ్చినప్పుడు కచ్చితంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతానని అన్నారు. ఇది ఓ అద్భుత కార్యక్రమం అని ప్రశంసించారు.

ఎక్కడా స్వార్థం లేకుండా ఈ కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్నారంటూ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ని రాష్ట్రపతి అభినందించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మొక్కల ప్రాధాన్యాన్ని తెలిపే వృక్షవేదం పుస్తకాన్ని రాష్ట్రపతికి బహూకరించారు. ఓ మొక్కను కూడా అందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ గురించి తనకు తెలుసని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. నిస్వార్థంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ సంతోష్ కుమార్ ని ఆమె అభినందించారు. ప్రజలకు, పర్యావరణానికి ఉపయోగకరమైన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు.

Also Read: Prabhas Salaar: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. సలార్ టీజర్ వచ్చేస్తోంది!

  Last Updated: 05 Jul 2023, 11:26 AM IST