Parliament Inauguration : పార్ల‌మెంట్ ప్రారంభోత్స‌వ `బాయ్‌కాట్‌`పై BRS సందిగ్ధం

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం( Parliament inauguration) బీఆర్ఎస్, బీజేపీ వేసుకున్న ముసుగును తీయ‌నుంది.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 12:11 AM IST

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం( Parliament inauguration) బీఆర్ఎస్, బీజేపీ వేసుకున్న ముసుగును తీయ‌నుంది. ఆ రోజున బీఆర్ఎస్ (BRS) పార్టీ బాయ్ క‌ట్ చేస్తే భ‌విష్య‌త్ లో కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర అయ్యే అవ‌కాశం ఉంది. ఇటీవ‌ల క‌ర్ణాట‌క సీఎం సిద్ధిరామ‌య్య ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వానికి కేసీఆర్ ను ఆహ్వానించ‌కుండా కాంగ్రెస్ దూరంగా పెట్టింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని బల‌మైన పార్టీలు గా ఉన్న టీడీపీ, వైసీపీల‌కు కూడా ఆహ్వానం పంప‌లేదు. అంటే, కాంగ్రెస్ దృష్టిలో బీజేపీతో ఉన్న పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీగా ఉంది. తెలుగుదేశం పార్టీ బాహాటంగా బీజేపీ పొత్తును కోరుకుంటోంది. ఇక బీఆర్ఎస్, వైసీపీ మాత్రం చీక‌టి గేమ్ ఆడుతున్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే.

బీఆర్ఎస్, బీజేపీ వేసుకున్న ముసుగు (Parliament inauguration)

నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న్ ప్రారంభోత్స‌వానికి( Parliament inauguration) దేశంలోని అన్ని పార్టీల‌కు కేంద్రం ఆహ్వానం పంపుతోంది. అయితే, ప్ర‌జాస్వామ్యాన్ని అవ‌మాన‌ప‌రిచేలా రాష్ట్ర‌ప‌తిని కాద‌ని ప్ర‌ధాని మోడీ, స్పీక‌ర్ ఓం ప్ర‌కాష్ బిర్లా ప్రారంభించ‌డం ఏమిటి? అంటూ విప‌క్షాలు బాయ్ క‌ట్ చేస్తున్నాయి. భారత జాతీయ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) త‌దిత‌ర‌ 19 ప్రతిపక్ష పార్టీలు నూత‌న పార్ల‌మెంట్ భ‌వ‌న ప్రారంభోత్స‌వాన్ని బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు వెల్ల‌డించాయి.

ఆదివాసీ ప్రెసిడెంట్‌ను కాద‌ని ప్రారంబోత్స‌వం

రాజ‌కీయ కోణం నుంచి ఈ ప్రారంభోత్స‌వాన్ని విప‌క్షాలు (Parliament inauguration) బ‌లంగా తీసుకెళుతున్నాయి. కార‌ణం ప్ర‌స్తుతం రాష్ట్ర‌ప‌తి ముర్ము ఎస్టీ సామాజిక‌వ‌ర్గం. ఆ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా న‌రేంద్ర‌మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న స్లోగ‌న్ విప‌క్ష నేత‌లు అందుకున్నారు. ఇదే స్లోగ‌న్ ఈనెల 28వ తేదీ నాటికి బలంగా తీసుకెళ్ల‌డానికి సిద్ధ‌య్యాయి. అందుకే, 19 పార్టీలు బుధ‌వారం అధికారికంగా ప్రెస్ రిలీజ్ చేస్తూ బ‌హిష్క‌రిస్తున్న విష‌యాన్ని వెల్ల‌డించారు. దేశం తొలి మహిళా ఆదివాసీ ప్రెసిడెంట్‌ను కాద‌ని ప్రారంబోత్స‌వం చేయ‌డం రాజ్యాంగ స్పూర్తిని బలహీనపరుస్తుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

Also Read : KCR Governament : వరంగ‌ల్ సెంట్ర‌ల్ జైలు తాక‌ట్టు! RBIకి ఫిర్యాదు

షెడ్యూల్ ప్ర‌కారం మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని( Parliament inauguration) ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా జాతికి అంకితం చేయనున్నారు. ఉభయ సభల ఎంపీలకు భౌతిక , డిజిటల్ రూపాల్లో ఆహ్వానాలు పంపబడ్డాయి. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్ ధంఖర్ అభినందన సందేశాలను విడుదల చేసే అవకాశం ఉంది. ప్రొటోకాల్ ను కాద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ చేస్తోన్న ఈ కార్య‌క్ర‌మానికి ఆప్, టీఎంసీ త‌దిత‌ర కాంగ్రెస్, బీజేయేత‌ర పార్టీలు కూడా దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీజేపీతో చీకటి రాజ‌కీయం న‌డుపుతోన్న టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు తీసుకునే నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

BRS రేపు నిర్ణయంపై ఉత్కంఠ

ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం లేదని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎంపీ కే కేశవరావు సూచాయ‌గా చెప్పారు. కానీ, “మేము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గురువారం మా నిర్ణయాన్ని ప్రకటిస్తాం’’ అని బీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావు తెల‌ప‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది.

కొత్త పార్లమెంట్ భవనం వివరాలు

ప్రస్తుత పార్లమెంట్ భవనం 1927లో పూర్తయి దాదాపు 100 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఈ భవనంలో స్థలం కొరత ఏర్పడింది. ఉభయ సభల్లోనూ ఎంపీల సిట్టింగ్‌కు అనుకూలమైన ఏర్పాట్లు లేకపోవడంతో సభ్యుల పని తీరుపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుత పార్లమెంటు భవనంలో లోక్‌సభలో 543 మంది, రాజ్యసభలో 250 మంది సభ్యులు కూర్చునే అవకాశం ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులతో సమావేశానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్ 10, 2020న మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జ‌రిగిన సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు ఈనెల 28న ప్రారంభం కానుండ‌గా దానికి రాజ‌కీయం ముసురుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌ను ఈ ప్రారంభోత్స‌వం మార్చ‌నుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read : BRS Lucky : కేసీఆర్ కు వ‌రంగా రూ. 2వేల నోట్ ర‌ద్దు