Site icon HashtagU Telugu

Janwada Rave Party : పరారీలో రాజ్ పాకాల

Rajpaakala Parari

Rajpaakala Parari

హైదరాబాద్‌ శివారు జన్వాడలో జరిగిన రేవ్‌ పార్టీ జరగడం.. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది.. పార్టీలో పాల్గొన్న వాళ్లలో డ్రగ్స్‌ తీసుకున్నట్టు తేలింది. రాజ్‌ పాకాలకు చెందిన ఈ ఫామ్‌హౌస్‌లో పార్టీకి 35 మంది హాజరయ్యారు. పార్టీలో ఉన్న వారికి డ్రగ్స్ టెస్టు చేస్తే.. విజయ్‌ మద్దూరికి కొకైన్ పాజిటివ్ వచ్చింది. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

రేవ్ పార్టీలో అనుమతి లేని విదేశీ మద్యం, గేమింగ్‌ కాయిన్స్‌, క్యాసినో మెటీరియల్‌ గుర్తించారు.. రాజ్‌పాకాలపై NDPS, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేవెళ్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దీనిపై బిజెపి , కాంగ్రెస్ పార్టీల నేతలు కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. మరోపక్క ఈ పార్టీపై ఎక్సైజ్ సీఐ శ్రీలత స్పందించారు. ‘నిబంధనలు ఉల్లంఘించి పార్టీ నిర్వహించారు. ఏ1గా ఫామ్ హౌస్ సూపర్వైజర్ కార్తీక్, ఏ2గా రాజ్ పాకాలను చేర్చాం. కర్ణాటక లిక్కర్ తో పాటు 7 లీటర్ల విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నాం. రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. దర్యాప్తు చేస్తున్నాం’ అని ఆమె వెల్లడించారు.

ప్రస్తుతం రాజ్ పాకాల సోదరుడు శైలేందర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాయదుర్గం ఓరియన్ విల్లాస్లోని శైలేందర్ ఇంట్లోకి పోలీసులు వెళ్లేందుకు ప్రయత్నించగా BRS నేతలు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటి తలుపులు పగులగొట్టేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో భారీగా విదేశీ మద్యం నిల్వలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

జన్వాడ ఫామ్ హౌజ్లో రేవ్ పార్టీ జరిగిందనే వార్తలపై BRS MLA వివేకానంద స్పందించారు. దీనికి సంబంధించిన FIR ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. ‘ఇళ్లు కూల్చితే మాట్లాడని, రైతులకు రుణమాఫీ, రైతుబంధు వేయకపోతే అడగని బండి సంజయ్ ఓ ప్రైవేటు పార్టీకి సంబంధించిన సమాచారం కావాలని అడుగుతున్నారు. ఇదంతా రేవంత్, సంజయ్ కుట్ర. ఆయన కేంద్రానికి కాకుండా రేవంత్ కు సహాయ మంత్రిగా పని చేస్తున్నారు’ అని అన్నారు.

Read Also : 5000 Shooters : లారెన్స్‌ను చంపేందుకు 5వేల మంది షూటర్లు : యువకుడి వార్నింగ్ వీడియో వైరల్