Palvai Sravanthi : కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పాల్వాయి స్రవంతి

మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు

Published By: HashtagU Telugu Desk
Palvai Sravanthi

Palvai Sravanthi

ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి భారీ షాక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి (Palvai Sravanthi ) ఆ పార్టీకి రాజీనామా (Resigns from Congress
) చేశారు. ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో లోనైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అప్పట్లో ఆమె మూడో స్థానంలో నిలిచారు. తాజాగా బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ ఇవ్వడం, పార్టీలో ప్రాధాన్యత తగ్గడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారం జరిగిన రాజగోపాల్ రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. తాజాగా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ అధిష్ఠానానికి లేఖ పంపించారు. ఈరోజు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పాల్వాయి స్రవంతి తన తండ్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన తండ్రి తరపున మునుగోడులో ప్రచారంలో పాల్గొంది. ఆమె తన తండ్రి మరణాంతరం పూర్తి స్థాయిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2014లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమె మునుగోడు కాంగ్రెస్ టికెట్ ఆశించగా పొత్తుల్లో భాగంగా ఆ స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 27,441 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.

2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఆమె మునుగోడు ఆశించింది, కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ దక్కడంతో ఆమె స్వచ్ఛందంగా పోటీ నుంచి త‌ప్పుకుని ఆయన గెలుపు కోసం ప‌ని చేసింది. మునుగోడు శాసనసభ్యుడిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2022 ఆగస్టు 2న కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున బరిలోకి నిలిచింది. కానీ మూడో స్థానం తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈసారి టికెట్ వస్తుందని ఎంతో ఆశపడ్డ ఆమెకు కాంగ్రెస్ మొండిచేయి చూపించింది. దీంతో ఆమె పార్టీకి రాజీనామా చేసింది.

Read Also : Thummala Vs Puvvada Ajay : తుమ్మల – పువ్వాడ ల మధ్య ముదురుతున్న మాటలు

  Last Updated: 11 Nov 2023, 11:57 AM IST