Paleru Ticket : పాలేరు తుమ్మలకా..పొంగులేటికా..?

అధిష్టానం సూచనతో తుమ్మలతో పొంగులేటి ఈ రోజు సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఈ విషయమై వీరిద్దరు చర్చించుకున్నారు. అయితే.. పోటీచేసే స్థానంపై ఈ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం

Published By: HashtagU Telugu Desk
Paleru

Paleru

పాలేరు సీటు (Paleru Constituency) ఎవరికీ కావాలో మీరే డిసైడ్ చేసుకొని చెప్పండి అంటూ కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్టానం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు (Thummala Nageswara Rao) , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) లకు ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. బిఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ తుమ్మల..ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ లో చేరారు. అంతకు ముందు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..బిఆర్ఎస్ కు రాజీనామా చేసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం (Khammam) జిల్లాలో ఇద్దరి నేతలకు మంచి పట్టు ఉండడం తో..ఈ ఇద్దరు కాంగ్రెస్ లో చేరడం తో కాంగ్రెస్ కు బలం చేకూర్చినట్లు అయ్యింది. కాకపోతే ఇప్పుడు వీరిద్దరూ ఒకే సీటు కావాలని కోరుకోవడం ఇప్పుడు పార్టీ అధిష్టానాన్ని ఇబ్బంది పెడుతుంది.

వాస్తవానికి పొంగులేటి కొత్తగూడెం టికెట్ అనుకున్నాడు. కానీ ఇప్పుడు సిపిఐ..కాంగ్రెస్ పొత్తు అడుగుతుండడంతో కొత్తగూడెం స్థానం వారికీ కేటాయించబోతున్నారు. దీంతో పొంగులేటి పాలేరు స్థానం ఫై పట్టుబడుతున్నారు. ఇదే స్థానం ఫై ముందు నుండి తుమ్మల పట్టుబడుతూ వస్తున్నాడు. వాస్తవానికి బిఆర్ఎస్ ను ఇదే స్థానం అడిగినప్పటికీ వారు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే కే మరోసారిఇవ్వడంతో తుమ్మల..ఆ కోపం తో బయటకు వచ్చి,,కాంగ్రెస్ నుండి పాలేరు లో పోటీ చేయాలని భావిస్తున్నాడు. కానీ ఇప్పుడు పొంగులేటి కూడా పాలేరు సీటే అడుగుతుండడం తో అధిష్టానం ఎవ్వరికి ఇవ్వాలో చెప్పలేకపోతుంది. ఇక పాలేరు, ఖమ్మంలో ఎవరు పోటీ చేస్తారో మీరే తేల్చుకోండని తాజాగా హైకమాండ్ వీరికి చెప్పినట్లు సమాచారం.

We’re now on WhatsApp. Click to Join.

కొద్దీ రోజులుగా ఈ ఇద్దరు నేతలు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పొంగులేటి వర్గీయులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు పాలేరుతోనే తన రాజకీయం ముడిపడుందంటూ స్పష్టం చేస్తున్నారు. పాలేరుకు గోదావరి జలాలు పారించడమే తన లక్ష్యమని ఆయన ప్రకటిస్తున్నారు. అధిష్టానం సూచనతో తుమ్మలతో పొంగులేటి ఈ రోజు సమావేశమయ్యారు. అరగంటకు పైగా ఈ విషయమై వీరిద్దరు చర్చించుకున్నారు. అయితే.. పోటీచేసే స్థానంపై ఈ ఇద్దరు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. కానీ, ఈ నేతలు ఆ విషయాన్ని బయటకు ప్రకటించకపోవడం గమనార్హం. ప్రత్యర్థులను డిఫెన్స్ లోనే ఉంచడంలో భాగంగానే వారు పోటీ చేసే స్థానాలను ప్రకటించడం లేదని తెలుస్తోంది. తమ అభిప్రాయాన్ని ఇప్పటికే తుమ్మల, పొంగులేటి అధిష్టానానికి చేరవేసినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. చూద్దాం ఫైనల్ ఎవరు ఎక్కడి నుండి పోటీ చేస్తారో..!

Read Also : YS Sharmila : కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి షర్మిల కుట్ర..?

  Last Updated: 12 Oct 2023, 11:51 AM IST