Site icon HashtagU Telugu

Palamuru Local Representavtives : గోవాలో పాలమూరు రాజకీయం..ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా..!!

Goapalamuru

Goapalamuru

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు..జిల్లాలు కాదు రాష్ట్రాలు దాటుతున్నాయి. ప్రస్తుతం పాలమూరు రాజకీయం గోవా కు చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో.. అధికార పార్టీ కాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీల నాయకులు తమ ప్రజాప్రతినిధులను.. గోవాకు తరలించారు. గోవా క్యాంప్‌లో వీరంతా ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్న హోలీ సందర్భంగా రెండు పార్టీల ప్రజా ప్రతినిధులు మందేస్తూ..చిందేయరా అంటూ ఫుల్ గా ఎంజాయ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

దీనికి సంబదించిన వీడియోస్ సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్‌ నుంచి నవీన్‌కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ బరిలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో 1439 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సి ఓటర్లు ఉన్నారు. ఓటుకు మూడు నుంచి ఐదు లక్షల ఆఫర్ ఇస్తున్నాయట పార్టీలు. దీంతో ఓటర్లతో పాటు వారి కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్, కాంగ్రేస్ కూడా గోవా టూర్ కు తీసుకెళ్లాయి. క్యాంపుల వద్ద ప్రతిరోజూ ప్రత్యేక సమావేశాల తో పాటు , విందులు , వినోద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గోవాలోనే మకాం వేశారు పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు , మాజీ ఎమ్మెల్యేలు. మార్చి 28న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఉప ఎన్నిక జరగనుంది. ఇందుకోసం 10 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

Read Also : Pawan Kalyan : సొంత పార్టీకి రూ.10 కోట్ల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్