Errabelli Dayakar Rao : పాలకుర్తిలో ఎర్రబెల్లి కష్టమేనా..?

బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కు సైతం ఈసారి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది

  • Written By:
  • Publish Date - November 15, 2023 / 02:26 PM IST

ఈసారి బిఆర్ఎస్ (BRS) లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు (BRS Sitting MLAS) భారీ షాక్ లు తప్పవని సర్వేలు చెపుతున్నాయి. ముందు నుండి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల తాలూకా నియోజకవర్గాలలో వ్యతిరేకత తో ఉంది. రెండుసార్లు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు వారి సొంత ఆస్తులు పెంచుకోవడమే తప్ప నియోజక అభివృద్ధి కి కృషి చేసింది ఏమిలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల్లో కనిపిస్తారని..ఆ తర్వాత అంత హైదరాబాద్ కే పరిమితం అవుతారని..తమ సమస్యలు చెప్పుకుందామన్న అందుబాటులో ఉండరని చెపుతూ వస్తున్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) మంచి పథకాలే అందిస్తున్నప్పటికీ..ఆ పధకాలు తమ వరకు అందడం లేదని..నియోజక వర్గ నిధులు సైతం ఎమ్మెల్యేల ఖాతాల్లోకి , సర్పంచ్ ల ఖాతాల్లోకి వెళుతున్నాయి తప్ప..అభివృద్ధి లోకి రావడం లేదని అంటున్నారు.

ఇక పాలకుర్తి నియోజకవర్గ (Palakurthi Assembly Constituency) బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakar Rao) కు సైతం ఈసారి ఓటర్లు షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆ విషయం ఆయనకు కూడా అర్థమైందని..అందుకే ఆయనకు ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు. దీనికి నిదర్శనమే ఆయన సభలకు జనాలు రావడం లేదని..వచ్చిన వారంతా కాంగ్రెస్ కు జై కొడుతూ వచ్చారని చెపుతున్నారు. కేసీఆర్‌ ఎన్నికల సభలో మంత్రి ఎర్రబెల్లి చేసిన విజ్ఞప్తులే ఇందుకు నిదర్శనం అని.. ఓ మంత్రి అయిన ఎర్రబెల్లి కూడా చిన్న చిన్న విషయాలు ప్రస్తావించడం ముఖ్యమంత్రికి కూడా చిర్రెత్తేలా చేసిందని చెపుతున్నారు. దయాకర్‌రావు పనైపోయిందని గమనించిన కేసీఆర్‌ అధైర్యపడకు దయాకర్‌ అని సముదాయించడం పాలకుర్తిలో చర్చనీయాంశంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు సహా ఏ పని కూడా చేయలేకపోయానని బహిరంగంగా.. సీఎం కేసీఆర్‌ ముందే దయాకర్ రావు ప్రకటించి పరువు పోగొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా మంత్రి అయి ఉండి.. లైసెన్స్‌లు ఇప్పించానని.. ప్రైవేట్ ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇప్పించానని చెప్పడం.. ఓ అడుగు ముందుకేసి ఎన్నికల సభలో వరాలు ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేయడం వంటివి అన్ని కూడా ఆయనలో ఓటమి భయం పట్టుకుందునే అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. చూడాలి మరి ఏంజరుగుతుందో..?

Read Also : Revanth Reddy: అతడే ఒక సైన్యం, కాంగ్రెస్ ప్రచారమంతా రేవంత్ పైనే!