Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్థుల్లో అతి చిన్న వ‌య‌స్కురాలు ఆమె..!

తెలంగాణ ఎన్నిక‌లు ఈ సారి ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లురుతుంది.

  • Written By:
  • Publish Date - November 1, 2023 / 12:56 PM IST

తెలంగాణ ఎన్నిక‌లు ఈ సారి ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ఉవ్విళ్లురుతుంది. అందుకోసం పార్టీ నేత‌లు సైతం త్యాగాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంది. గెలుపు గుర్రాల‌కే టికెట్లు ప్ర‌క‌టిస్తుంది ఇప్ప‌టికే 100 టికెట్లు ప్ర‌క‌టించిన కాంగ్రెస్ మ‌రో 19 టికెట్లను రెండు మూడు రోజుల్లో ప్ర‌క‌టించ‌నున్నారు. బీఆర్ఎస్‌లో ఓట‌మి ఎరుగ‌ని నేత‌ల ఓట‌మే టార్గెట్‌గా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా పాల‌కుర్తిలో మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు ఓట‌మినే ల‌క్ష్యంగా రేవంత్‌రెడ్డి పావులు క‌దుపుతున్నారు. పాల‌కుర్తి కాంగ్రెస్ బ‌రిలో తోలుత ఎన్నారై ఝాన్సీరెడ్డికి ఖ‌రారుకాగా.. ఆమెకు పౌర‌స‌త్వం అడ్డురావ‌డంతో ఆమె కోడ‌లు య‌శ‌స్విరెడ్డిని బ‌రిలో దింపింది. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, ఓట‌మి ఎరుగ‌ని నేత‌గా ఉన్న ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావుని య‌శ‌స్విరెడ్డి ఢీకొడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్య‌ర్థుల్లో అతి చిన్న వ‌య‌స్కురాలుగా య‌శ‌స్విరెడ్డి ఉన్నారు. కేవ‌లం 26 ఏళ్ల వ‌య‌సులో య‌శ‌స్వి రెడ్డి రాజ‌కీయ ఆరంగ్రేటం చేశారు. హైదార‌బాద్‌లో విద్యాభ్యాసం చేసిన య‌శ‌స్విరెడ్డి.. ఝాన్సీ రెడ్డి కుమారుడితో వివాహం అయింది. వివాహం త‌రువాత ఆమె అమెరికాలో ఉంటున్నారు. ఝాన్సీరెడ్డి వ్యాపార కార్యాక‌లాపాల‌ను య‌శ‌స్విరెడ్డి చూస్తున్నారు. గ‌త ఎడాదిగా అత్తా కోడళ్లు అమెరికా నుంచి వ‌చ్చి పాల‌కుర్తిలో సేవా కార్య‌క్ర‌మాల‌ను చేస్తున్నారు. ఝాన్సీరెడ్డికి కాక‌పోయిన త‌న కోడ‌లకు టికెట్ రావ‌డంతో ఆమె ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఎర్ర‌బెల్లిని ఓడించేది తామేనంటూ నియోజ‌క‌వ‌ర్గంలో విస్తృత్తంగా ప‌ర్య‌టలు చేస్తున్నారు. మ‌రి అత్తా కోడ‌ళ్లు ఓట‌మి ఎరుగ‌ని నేతను ఓడిస్తారోమ లేదో.. కౌంటింగ్ రోజు వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Also Read:  Congress Candidates : కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఆలస్యం.. బిఆర్ఎస్ కు కలిసొస్తుందా..?