Site icon HashtagU Telugu

Chandrababu : ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

Paalabhishekam Cbn

Paalabhishekam Cbn

ఓయూలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం (Palabhishekam for Chandrababu) చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు అభిమానులు. 4 వ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) మరికాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలతో పాటు కీలక అంశాల గురించి చర్చించనున్నారు. బేగంపేటలోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో జరిగే ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటలకు మొదలై. రాత్రి పది గంటల వరకు కొనసాగే అవకాశముందని తెలుస్తుంది.

రెండు రాష్ట్రాల సీఎంల మీటింగులో పాల్గొననున్న సభ్యులు

తెలంగాణ తరఫున :-

రేవంత్ రెడ్డి, సీఏం

భట్టి విక్రమర్క, డిప్యూటీ సీఎం,

పొన్నం ప్రభాకర్ గౌడ్, మంత్రి

శ్రీధర్ బాబు, మంత్రి

అధికారులు :

శాంతి కుమారి, సీఎస్
మరో ఇద్దరు అధికారులు

ఆంధ్ర ప్రదేశ్ నుండి :-

చంద్రబాబు నాయుడు, సీఏం

మంత్రులు
కందుల దుర్గేశ్
సత్య ప్రసాద్
బీసీ జనార్ధన్

ఆఫీసర్లు
నీరబ్ కుమార్, సీఎస్
కార్తికేయ మిశ్రా, ఐఏఎస్
రవిచంద్ర, ఐఏఎస్

ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఇదిలా ఉంటె ఓయూలో చంద్రబాబు, రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చంద్రబాబు ఫ్యాన్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఓయూ పీహెచ్‌డీ విద్యార్థి తలారి శ్రీనివాసరావు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగు వేయడం శుభపరిణామమని అని , విభజన సమస్యలను ఇద్దరు సీఎంలు పరిష్కరించుకోవాలని వారు కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

నిన్న రాత్రి ఢిల్లీ నుండి బేగం పేట్ ఎయిర్ పోర్ట్ (Begumpet Airport) కు చేరుకున్న సీఎం చంద్రబాబు కు తెలుగు తమ్ముళ్లు (Telugu Brothers) ఘన స్వాగతం పలికారు. బేగం పేట్ నుండి జూబ్లీహిల్స్ లోని బాబు నివాసం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. రోడ్డు పొడుగూతా అభిమానులకు చంద్రబాబు అభివాదం చేస్తూ వచ్చారు. ఓ పక్క జోరు వర్షం పడుతున్న కార్యకర్తలు , అభిమానులు మాత్రం అలాగే ర్యాలీగా వెళ్లి తమ అభిమానం చాటుకున్నారు. ఇక జూబ్లిహిల్స్‌లోని, ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌కు బాబు చేరుకోగానే భారీగా బాణాసంచా కాల్చీ స్వాగతం పలికారు. మరోపక్క హైదరాబాద్ అంత కూడా పసుపుమయం చేసారు అభిమానులు. భారీగా ప్లెక్సీ లు , కటౌట్ లు ఏర్పాటు చేసి బాబు ఫై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. దాదాపు పదేళ్లుగా ఈ రేంజ్ లో ప్లెక్సీ లు , కట్ఔట్స్ ఏర్పాటు చేయలేదు. ఫస్ట్ టైం ఈ రేంజ్ లో బాబు కు గ్రాండ్ వెల్ కామ్ చెప్పడం జరిగింది.

Read Also :