Site icon HashtagU Telugu

Revanth Reddy : పాడి కౌశిక్ రెడ్డి కాళ్లు మొక్కిన రేవంత్ రెడ్డి

Paadi Revanth

Paadi Revanth

Padi Kaushik Reddy Shocking Comments On CM Revanth : గత వారం రోజులుగా తెలంగాణ లో పాడి కౌశిక్ రెడ్డి vs కాంగ్రెస్ (Paadi Koushik Vs Congress )వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arikepudi Gandhi)కి పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యల తర్వాత ఇరు నేతల మధ్య సవాళ్లు , ప్రతి సవాళ్లు నెలకోవడం కాదు దాడులు , అరెస్ట్ ల వరకు వెళ్లాయి. ఈ వ్యవహారం ఇప్పట్లో చల్లారేలా లేదు. తాజాగా పాడి కౌశిక్ రెడ్డి..సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత ఆగ్రహం నింపారు.

తాను కాంగ్రెస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంటికొచ్చి తన కాళ్లు మొక్కారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నారు. TPCC చీఫ్ అయ్యేందుకు మద్దతు కోరుతూ కాళ్లు మొక్కారని కౌశిక్ చెప్పుకొచ్చారు. అంతే కాదు రేవంత్‌ను కుర్చీ దింపే వరకూ తాను కాంప్రమైజ్ కానని తేల్చి చెప్పారు. అంతరకూ నిద్రపోకుండా పనిచేస్తానని తెలిపారు. ‘నీది కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు అంతటి స్థాయి కాదు. వీధి రౌడీ స్థాయికి దిగజారావు’ అని విమర్శించారు.

తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలి. హామీల అమలు గురించి అడిగితే దాడి చేయిస్తున్నారు. దాడి చేయించానని స్వయంగా ఆయనే చెప్పారు. రేవంత్ కు నేను భయపడను. చావడానికైనా సిద్ధం. దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తా’ అని కౌశిక్ వ్యాఖ్యానించారు.

Read Also : Anna Hazare : రాజకీయాల్లోకి రావొద్దని చెప్పినా కేజ్రీవాల్ వినలేదు : అన్నా హజారే