తెలంగాణ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress), బిఆర్ఎస్ (BRS) పార్టీల ముఖ్య నేతలు బరిలో నిల్చున్న చోట ఆసక్తిగా మారుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో హుజురాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుండి బిజెపి నుండి ఈటెల (Etela Rajender)..బిఆర్ఎస్ నుండి పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) బరిలోకి దిగడం తో ఎక్కడ గెలుపు ఎవర్ని వరిస్తుందో అనే ఆత్రుత అందరిలో ఉంది. ఆ మధ్య జరిగిన హుజురాబాద్ (Huzurabad ) ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్..బిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఫై విజయం సాధించారు. ఈసారి బిఆర్ఎస్ పాడి కౌశిక్‌రెడ్డి ని రంగంలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ గట్టిగా నడుస్తుంది. ఇద్దరు కూడా తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఈటల రాజేందర్‌ని ఓడించడమే లక్ష్యంగా కౌశిక్‌రెడ్డి కుటుంబం సైతం ప్రచారంలోకి దిగింది. ముఖ్యంగా కౌశిక్‌రెడ్డి కూతురు శ్రీనిక (Padi Kaushik Reddy Daughter Shrinika) కొన్నిరోజులుగా తన నాన్న గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతూ..మా నాన్నకు ఓటు వెయ్యండి ప్లీజ్ అంటూ అడుగుతున్న వీడియోస్ ఇప్పటికే సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇలా ఉండగానే ఇప్పుడు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో కౌశిక్‌రెడ్డి కూతురు తన ప్రసంగంతో కేసీఆర్ ను సైతం ఆకట్టుకుంది. ‘మా నాన్న హుజరాబాద్ నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేస్తున్నారు. పేద ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈసారి ఎన్నికల్లో నా తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. ప్లీజ్ మా డాడీని గెలిపించండి.. 1000 కోట్లు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ ఓటర్లకు ప్రామిస్ చేసింది. అంతేకాదు నా తండ్రికి రాజకీయాలు అంటే చాలా ఇష్టం అని, ఇప్పటికే మీరు నా తండ్రిని పలుమార్లు ఎన్నికల్లో ఓడించి ఇబ్బందికి గురి చేశారు. మా నాన్న అంటే నాకు ప్రాణం, ఆయన బాధపడితే చూడలేను’’ అని కౌశిక్‌రెడ్డి కూతురు కన్నీరు పెట్టుకుంది. ఇలా ఆ అమ్మాయి మాట్లాడుతుంటే సభకు వచ్చిన వారంతా సైలెంట్ గా ఆమె మాటలు వింటూ ఎమోషనల్ కు గురయ్యారు. అలాగే సీఎం కేసీఆర్ సైతం ఆమె మాటలకు హర్షం వ్యక్తం చేస్తూ కాస్త ఎమోషనల్ కు లోనయ్యారు.
Read Also : KCR : నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోస్తూ.. చంద్రబాబుకు చెంచాగిరి చేసినోడు..ఈరోజు నన్ను తిడుతున్నాడు – కేసీఆర్
