Padi Kaushik Reddy : అసెంబ్లీలో కౌశిక్‌ రెడ్డి కూతురు అత్యుత్సాహం..బయటకు పంపిన సిబ్బంది

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy )..నేడు అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం (Oath As MLA In Assembly) చేసారు. ఈ క్రమంలో ఆయన కూతురు శ్రీనిక (Padi Kaushik Reddy Daughter Shrinika) చేసిన అత్యుత్సాహం సభకు ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు పంపించారు. We’re now on WhatsApp. Click […]

Published By: HashtagU Telugu Desk
Paadi

Paadi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజురాబాద్ నుండి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy )..నేడు అసెంబ్లీ లో ఎమ్మెల్యే గా ప్రమాణ స్వీకారం (Oath As MLA In Assembly) చేసారు. ఈ క్రమంలో ఆయన కూతురు శ్రీనిక (Padi Kaushik Reddy Daughter Shrinika) చేసిన అత్యుత్సాహం సభకు ఇబ్బందిగా మారింది. దీంతో వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను బయటకు పంపించారు.

We’re now on WhatsApp. Click to Join.

పాడి కౌశిక్ రెడ్డి విజయంలో ఆయన కూతురు పాత్ర చాల ఉంది. నామినేషన్ వేసిన దగ్గరి నుండి తండ్రి వెంటే ప్రచారం చేస్తూ..మా నాన్న కు ఒక్క అవకాశం ఇవ్వండి ..ప్లీజ్ అంటూ ప్రతి ఒక్కరిని అడిగింది. అలాగే కౌశిక్ భార్య సైతం ప్రచారంలో పాల్గొని భర్త విజయంలో పాలుపంచుకుంది. ఇలా కుటుంబం అంత ప్రచారం చేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం జరుగుతోంది. మొదటి రోజు ప్రమాణస్వీకారం చేయని సభ్యులతో ఇవాళ ప్రమాణస్వీకారం చేయించారు స్పీకర్‌ ప్రసాద్ కుమార్‌. ఎమ్మెల్యేలంతా వరుసగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు.

ఇదే క్రమంలో హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేశారు. అదే సమయంలో విజిటర్స్‌ గ్యాలరీలో ఉన్న కౌశిక్‌ కూతురు శ్రీనిక అత్యుత్సాహం ప్రదర్శించింది. లవ్‌ యూ డాడీ అంటూ పెద్దగా కేకలు వేసింది. దీంతో సీఎం రేవంత్‌ సహా అంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అసెంబ్లీ సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్‌ అయ్యారు. అసెంబ్లీలో అలాంటి పనులు చేయొద్దంటూ చెప్పి బయటకు పంపారు.

Read Also : Times Now ETG Survey: మళ్ళీ మోడీనే అంటున్న టైమ్స్ నౌ ఈటీజీ సర్వే

  Last Updated: 14 Dec 2023, 03:23 PM IST