Site icon HashtagU Telugu

Padi Kaushik Reddy Campaign : రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఇస్తా – పాడి కౌశిక్ రెడ్డి

Padi Kaushik Reddy Election

Padi Kaushik Reddy Election

ఎన్నికలు వస్తున్నాయంటే చాలు రాజకీయ పార్టీలన్నీ రకరకాల హామీలు ప్రకటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో కూడా అన్ని పార్టీలు తమ తమ మేనిఫెస్టో లతో ఆకట్టుకున్నాయి. అయితే హుజురాబాద్ బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి ఇస్తున్న హామీలకు నియోజకవర్గ ప్రజలు షాక్ అవుతున్నారు.

తాజాగా నియోజకవర్గంలోని వీణవంక మండలంలో ప్రకౌశిక్ రెడ్డి ప్రచారంలో మాట్లాడుతుండగా.. కొంత మంది రైతులు.. మాకింకా రుణమాఫీ అందలేదని కౌశిక్ కు చెప్పుకున్నారు. దీంతో ఎన్నికల పూర్తి కాగానే రుణమాఫీ చేస్తామని..రుణమాఫీ ఇవ్వలేని పక్షంలో ఆ డబ్బులు తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. అదేమీ రూపాయి రెండు రూపాయిలు కాదు..ఏకంగా రూ.2 వేల కోట్లు. అంత డబ్బు కౌశిక్ ఎలా ఇస్తాడు..? అంత డబ్బు కౌశిక్ దగ్గర ఉన్నాయా..? అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

తెలంగాణ ఎన్నికల ప్రచారం రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా బిజెపి (BJP) , కాంగ్రెస్ (Congress), బిఆర్ఎస్ (BRS) పార్టీల ముఖ్య నేతలు బరిలో నిల్చున్న చోట ఆసక్తిగా మారుతున్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో హుజురాబాద్ ఒకటి. ఈ నియోజకవర్గం నుండి బిజెపి నుండి ఈటెల (Etela Rajender)..బిఆర్ఎస్ నుండి పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) బరిలోకి దిగడం తో ఎక్కడ గెలుపు ఎవర్ని వరిస్తుందో అనే ఆత్రుత అందరిలో ఉంది. ఆ మధ్య జరిగిన హుజురాబాద్ (Huzurabad ) ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్..బిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ఫై విజయం సాధించారు. ఈసారి బిఆర్ఎస్ పాడి కౌశిక్‌రెడ్డి ని రంగంలోకి దింపింది. దీంతో ఇక్కడ పోటీ గట్టిగా నడుస్తుంది. ఇద్దరు కూడా తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. ఎలాగైనా ఈసారి ఈటల రాజేందర్‌ని ఓడించడమే లక్ష్యంగా కౌశిక్‌రెడ్డి కుటుంబం సైతం ప్రచారంలోకి దిగింది.

Read Also : Kandala Bank Fraud Case: కందాల బ్యాంక్ కేసులో ఈడీ దూకుడు