Site icon HashtagU Telugu

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

Brs Mla Padi Kaushik Reddy

Brs Mla Padi Kaushik Reddy

తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ క్వారీ యజమానిని బెదిరించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసారు. కేసు నమోదు నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో ఆయనను అదుపులోకి తీసుకుని, అనంతరం వరంగల్‌కు తరలించారు.

Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు

కౌశిక్ రెడ్డిపై వరంగల్ సుబేదారి పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ కేసు నమోదు అయ్యింది. క్వారీ యజమానిని బెదిరించడం, దాడికి ప్రయత్నించారన్న ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అధికారులు బీఎన్‌ఎస్ (భారతీయ న్యాయ సంహిత) సెక్షన్‌ 308(2), 308(4), 352ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈ సెక్షన్లు తీవ్ర ఆరోపణలకు సంబంధించినవిగా భావించబడతాయి. ఈ అంశంపై ఇంకా పోలీసులు పూర్తి వివరాలను తెలియజేయాల్సి ఉంది.

lifestyle : నెల రోజులు చక్కెర తినడం మానేస్తే మనిషి శరీరంలో ఎన్ని అద్బుతాలు జరుగుతాయంటే?

కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. ముఖ్యంగా ఎన్నికల తరువాత ప్రతిపక్ష నాయకులపై టార్గెట్ జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్న వేళ ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీలు దీనిపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తుండగా, బీఆర్ఎస్ నేతలు స్పందనకు దూరంగా ఉన్నారు. ఈ కేసు విచారణ ఎలా సాగుతుంది, రాజకీయ పరంగా దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందన్న దానిపై అందరి దృష్టి మళ్లింది.