Padi Kaushik : బ్లాక్‌బుక్‌లో పొన్నం ప్రభాకర్‌ పేరు – కౌశిక్ రెడ్డి

ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం సాక్షిగా బ్లాక్ బుక్ ఓపెన్ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్

Published By: HashtagU Telugu Desk
Paadi Black Book

Paadi Black Book

హుజురాబాద్ రాజకీయం వాడివేడిగా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ vs బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Ponnam Vs Padi Kaushik) మధ్య ఎన్టిపిసి ఫ్లై యాష్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.ఫ్లైయాష్ తరలింపు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించిన నేప‌థ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల విమర్శలు ప్రతివిమర్శలు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉద్రిక్తతకు దారితీశాయి. కేవలం పబ్లిసిటీ కోసం మంత్రి పొన్నం పై ఆరోపణలు చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఎమ్మేల్యే కాకముందు ఉద్యోగులు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని తాజాగా హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జి తీవ్ర వ్యాఖ్యాలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద సాక్ష్యాలతో నిరూపిస్తానని కౌశిక్ రెడ్డి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. సవాల్ ను స్వీకరించిన కౌశిక్ రెడ్డి తాను కూడా వస్తానని ప్రకటన చేసి నిన్న సవాల్ కు సిద్ధం కాగా..ఆయన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయానికి కౌశిక్ చేరుకున్నారు. తనపై పొన్నం ప్రభాకర్‌ తప్పుడు ఆరోపణలు చేశారని .. తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు పొన్నం ఎందుకు రాలేదని ప్రశ్నించారు. రూ.100 కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందని , బ్లాక్‌బుక్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేరుతోనే మొదలు పెట్టానని కౌశిక్ తెలిపారు. 2029 అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక కౌశిక్ బ్లాక్ బుక్ లో పేరు రాసానని చెప్పడం..అంత కూడా ఈయన నారా లోకేష్ ను ఫాలో అవుతున్నట్లు ఉంది..ఏపీలో కూడా నారా లోకేష్ రెడ్ బుక్ రాసినట్టు, తెలంగాణాలో పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడు బ్లాక్ బుక్ రాస్తానని చెబుతున్నారని చర్చించుకుంటున్నారు.

Read Also : Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత

  Last Updated: 26 Jun 2024, 01:28 PM IST