Site icon HashtagU Telugu

Huzurabad : ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే విజయయాత్ర- లేకపోతే శవయాత్రే – కౌశిక్ రెడ్డి

Koushik

Koushik

తెలంగాణ ఎన్నికల ప్రచారం (Election Campaign) నేటితో ముగియనుంది. ఈ క్రమంలో బరిలో నిల్చున్న అన్ని పార్టీల అభ్యర్థులు విస్తృతంగా పర్యటిస్తూ.. ఎమోషనల్ కు గురవుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ (Huzurabad) బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)..ప్రచార చివరి రోజు కన్నీరు పెట్టుకుంటూ ప్రసంగించారు. ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే విజయాత్రకు వస్తానని… లేకుంటే డిసెంబర్‌ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలి అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

తొలిసారి టికెట్ దక్కించుకున్న కౌశిక్‌ రెడ్డి ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్రంగా ట్రై చేస్తున్నాడు. కేవలం ఆయన ఒక్కడే కాదు ఫ్యామిలీ సభ్యులందర్నీ ప్రచారంలోకి తీసుకొచ్చారు. గత కొద్దీ రోజులుగా కౌశిక్ తో పాటు ఆయన భార్య , కూతురు సైతం నియోజకవర్గం లో విస్తృతంగా ప్రచారం చేస్తూ..ఒక్క ఛాన్స్ తన భర్త కు ఇవ్వాలని కోరుతుంది..మరోపక్క మా తండ్రికి రాజకీయాలంటే ఎంతో ఇష్టమని..ప్రజలకు సేవ చేయాలనీ ఎప్పుడు తప్పించిపోతారని..ఒక్క ఛాన్స్ నా తండ్రికి ఇవ్వండి..నియోజకవర్గాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తారని హామీ ఇస్తూ ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలో చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న కౌశిక్ రెడ్డి తనను కచ్చితంగా గెలిపించాలని కోరారు. గెలవడమో తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడమో రెండే మార్గాలని అభిప్రాయపడ్డారు. ప్రచారం చేసిన ప్రాంతంలోనే తమ శవాలు కనిపిస్తాయన్నారు. ప్రజలు ఓటు వేస్తే డిసెంబర్‌ 3 విజయాత్రకు వస్తానని… లేకుంటే డిసెంబర్‌ 4న తన శవయాత్రకు ప్రజలు రావాలి అన్నారు. కారు గుర్తుపై పోటీ చేస్తున్న తనకు ఒక్క అవకాశం ఇస్తే తన తల ప్రజల కడుపులో పెట్టుకుంటానని హుజురాబాద్‌ను కాపాడుకుంటానని చెప్పుకొచ్చారు.

Read Also : Malla Reddy : బిజినెస్ మాన్ చూసి రాజకీయాల్లోకి వచ్చా – మంత్రి మల్లారెడ్డి