Rajasingh : మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఒవైసీ కాలేజీతో పాటు ఇంటిని కూడా కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా విభాగం జరుపుతున్న కూల్చివేతలపై స్పందిస్తూ రాజా సింగ్ ఈ కామెంట్స్ చేశారు. ఒవైసీ ఇల్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్‌లోనే ఉండొచ్చని కామెంట్ చేశారు. ఈ అంశంపై దర్యాప్తు చేసేలా హైడ్రా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపైకి కూడా బుల్డోజర్‌ను పంపాలన్నారు. ఒవైసీ ఫాతిమా కాలేజ్ చెరువు పైన కట్టారని రాజాసింగ్ తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
ఎట్టి పరిస్థితుల్లోనూ ఒవైసీకి చెందిన కాలేజీని కూడా కూల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘గతంలో అయ్య జాగీరు లాగా ఒవైసీ వాళ్లు కాలేజీ కట్టుకున్నారు. అప్పుడు వాళ్ల గులాం పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ కాలేజీ జోలికి వస్తే 40వేల మంది యువకులు చూసుకుంటారని అక్బరుద్దీన్ ఒవైసీ బెదిరిస్తున్నారు. రేవంత్ రెడ్డి వాళ్లకు భయపడొద్దు’’ అని రాజాసింగ్(Rajasingh) పేర్కొన్నారు. ‘‘సీఎం రేవంత్ గారు మీరు తీసుకున్న సంకల్పంతో ముందుకు సాగండి. చెరువుల కబ్జాలను తొలగించండి. నా నియోజకవర్గంలో కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయి. హైదరాబాద్ కలెక్టర్ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Kavithas Bail : ఈడీ కేసులో కవితకు బెయిల్.. వాదోపవాదనల వివరాలివీ
అక్బరుద్దీన్ ఒవైసీ కామెంట్స్
హైదరాబాద్‌లోని బండ్లగూడలో ఉన్న ఫాతిమా ఒవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలపై ఇటీవలే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక కామెంట్స్ చేశారు. ‘‘కావాలంటే నాపై మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి. ఆ స్కూల్ మాత్రం కూల్చకండి. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు కట్టాను. వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారు. పేదల విద్యాభివృద్ధికి జరుగుతున్న కృషికి అడ్డుపడకండి’’ అని అక్బరుద్దీన్ కోరారు.