Owaisi: అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఒవైసీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎదురుదాడికి దిగారు.

Owaisi: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎదురుదాడికి దిగారు.

తెలంగాణలో ఆదివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. అంతే కాకుండా ఒవైసీ ఎజెండాను కేసీఆర్ పాటిస్తున్నారని షా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఏఐఎంఐఎం నేత అమిత్ షాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. “ఈ ఒవైసీ-ఒవైసీ ఏడుపు ఇంకెంత కాలం సాగుతుంది? అంటూ అమిత్ షాని ప్రశ్నించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎలాంటి విజన్ లేదు. బూటకపు ఎన్‌కౌంటర్లు, సర్జికల్ స్ట్రైక్స్, కర్ఫ్యూ, బుల్డోజర్లు, నేరస్తులను విడుదల చేయడం గురించి మాత్రమే మాట్లాడతారు. తెలంగాణా ప్రజలను ఎందుకు అంత ద్వేషిస్తున్నారు? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయాలనే విషయంలో షా సీరియస్‌గా ఉంటే 50 శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఆదివారం తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప్ సభలో అమిత్ షా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (1948లో నిజాం సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడం) కేసీఆర్‌ జరుపుకోలేదని షా విమర్శించారు. ఒవైసీ ఎజెండాను కేసీఆర్ అనుసరిస్తున్నారన్నారు. ఏఐఎంఐఎంకు మేం భయపడేది లేదని, తెలంగాణలో ప్రభుత్వం ఒవైసీ కోసం కాకుండా రాష్ట్ర ప్రజల కోసమే నడుస్తుందని అన్నారు.

Read More: Pregnancy Test: అమ్మాయిలకు గర్భస్థ పరీక్షలు.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు!