Owaisi: ఏం తినాలో.. ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో నిర్ణయించడం హాస్యాస్పదం

మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు.

  • Written By:
  • Updated On - December 18, 2021 / 11:36 AM IST

మహిళల కనీస వివాహ వయస్సును 18 నుండి 21 సంవత్సరాలకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదమని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఇతర ప్రయోజనాలకోసం చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణిస్తున్న 18 సంవత్సరాలనే కనీస వివాహ వయస్సుగా పరిగణించాలని అసద్ డిమాండ్ చేశారు.

18 సంవత్సరాలు దాటినవాళ్లు ఓటుహక్కు వినియోగించుకోని ప్రధానమంత్రిని, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు, కాంట్రాక్టులపై సంతకాలు, వ్యాపారాలు చేసుకొనే వెసులుబాటు ఉందికానీ అదే వయస్సులో పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండదా అని ప్రశ్నిస్తూ అసద్ ట్వీట్ చేశారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమయ్యే నిర్ణయాలు తీసుకునేవాడని ఒవైసీ తెలిపారు. అభివృద్ధి చెందిన యూకే, యూఎస్ లాంటి దేశాల్లో వివాహ వయస్సు 14 కంటే తక్కువగా కూడా ఉందని అక్కడి యువత వారి తల్లితండ్రుల అనుమతితో ఆ వయస్సులో పెళ్లి చేసుకోవచ్చని ఒవైసీ గుర్తుచేశారు.

ఏం తినాలో, ఎవరిని పూజించాలో, ఎప్పుడు పెళ్లిచేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదమని, కనీస వివాహ వయస్సు విషయం కంటే యువకులకు మెరుగైన విద్య, ఆర్థిక అవకాశాలను కల్పించడం లాంటి విషయాలను ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుందని అసద్ సూచించారు. యువతను పిల్లలుగా ట్రీట్ చేయొద్దని వారికి ఆలోచించుకొని స్పేస్ ఇవ్వాలని అందుకే 20 ఏళ్ల యువకులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అవ్వడానికి అనుమతించే ప్రయివేట్ బిల్లును తాను ప్రతిపాదించానని ఓవైసి తెలిపారు.