Owaisi Brothers Feliciated Subhan Khan : సుభాన్ ఖాన్ (Subhan Khan)..ఈ పేరు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. పోతే ఒక్కడినే.. బతికితే 9 మంది (If I die, I die alone. Else, I come back with nine) అనే సాహసంతో తొమ్మిది మందిని రక్షించి రియల్ హీరో (REAL HERO) అనిపించుకున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోయినా..ఊరివారు ముందుకు రాకపోయినా తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మున్నేరు నదిపై ప్రకాష్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని కాపాడి ఈరోజు వార్తల్లో నిలిచారు. సుభాన్ ఖాన్ చేసిన ధైర్యానికి ఊరు వాడ, ఖమ్మం నగరమే కాదు యావత్ తెలుగు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
సుభాన్ ఖాన్ కు రూ.51 వేల చెక్ అందజేసిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
సుభాన్ ఖాన్‌ను అతని ధైర్యసాహసాలకు గాను ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాద్-ఉల్ ముస్లిమీన్ (AIMIM) శనివారం అతన్ని సన్మానించింది. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఇతర ఎమ్మెల్యేలు సుభాన్‌ను దర్రస్ సలామ్ వద్ద కలుసుకుని రూ.51,000 చెక్కును అందజేశారు. అలాగే సుభాన్ ఖాన్ కు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందించాలని, అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకం కింద 2 బిహెచ్‌కె ఫ్లాట్‌ను అందించాలని ఒవైసీ (Asaduddin Owaisi) సీఎం రేవంత్ రెడ్డి ని, ఖమ్మం జిల్లా కలెక్టర్‌ను కోరారు.
మున్నేరు వాగులో చిక్కుకున్న 09 మందిని రక్షించిన సుభాన్ ఖాన్
గత వారం ఖమ్మం మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రవాహానికి ఖమ్మం లోని పలు నగరాలు నీటమునిగాయి. అయితే ప్రకాశ్ నగర్ వద్ద మున్నేరుపై వంతెన వుంది… అప్పటికే ఆ వంతెనను ఆనుకుని ప్రవాహం సాగుతోంది. ఇలాంటి సమయంలోనే 9 మంది ఈ వంతెనపైకి చేరుకుని ఓవైపు నుండి మరోవైపు వెళ్ళే ప్రయత్నం చేసారు. సరిగ్గా వంతెన మధ్యలోకి చేరుకోగానే మున్నేరు నీటి ప్రవాహం పెరింగింది. దీంతో రెండువైపులా నీరుచేరి వీరు మధ్యలో చిక్కుకున్నారు. ముందకు కానీ వెనక్కు కానీ వెళ్లకుండా ప్రవాహం పెరిగింది. కొన్ని గంటల పాటు వారు అలాగే సాయం కోసం అందరికి ఫోన్లు చేసారు. కానీ ఎవ్వరు ముందుకు రాలేదు. ఆ సమయంలో సుభాన్ ఖాన్ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జేసీబీ తో వంతెన పైకి వెళ్లి ఆ తొమ్మిదిని మందిని కాపాడి ఆయా కుటుంబాల పాలిట దేవుడయ్యాడు.
REAL HERO!🌊
9 people were stranded for hours in Munneru flood. Ignoring all advice, Subhan Khan drove his JCB alone & rescued them🚜
His said: “If I die, I die alone. Else, I come back with nine”
Subhan Khan, from Haryana, working in Khammam—Salute to him🫡#KhammamFloods pic.twitter.com/DbiZPvoPTr
— SHAIK RAFI (@skrafi81) September 4, 2024
Read Also : Vishwak Sen : మట్టితో స్వయంగా వినాయకుడిని తయారు చేసిన హీరో.. వీడియో వైరల్..