Telangana: యూపీఏ హయాంలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ మతకల్లోలాల నివారణకు ఓ చట్టం తీసుకొచ్చారు. అయితే ఆ చట్టాన్ని తెలంగాణలోను అమలుపర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అలాంటి చట్టం వస్తే తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం దారుస్సలాంలో జరిగిన సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ బక్రీద్‌కు రెండు రోజుల ముందు మెదక్‌లో ముస్లింలపై మితవాద మూక దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మతపరమైన అల్లర్లను నిరోధించడంలో కొత్త చట్టాలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. చట్టాలు తీసుకురావడం ద్వారా హింసను నియంత్రించడంలో విఫలమైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఒవైసి చెప్పారు.
తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ పటిష్టంగా అభివృద్ధి పథంలో కొనసాగాలంటే శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఆయా ప్రాంతాల్లో పోలీసు అధికారులను నియమించి, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలి. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read: PM Modi: వారణాసిలోని క్రికెట్ స్టేడియంలో ప్రధాని మోదీ ఆకస్మిక తనిఖీ