Site icon HashtagU Telugu

Traffic Violations: ట్రాఫిక్ రూల్స్ డోన్ట్ కేర్.. 7 రోజుల్లోనే 39 వేలు కేసులు నమోదు!

Traffic Rules

Traffic Rules

ట్రాఫిక్ రూల్స్ కోసం.. పోలీసులు వరుస అవగాహన కార్యక్రమాలు, స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నప్పటికీ, వాహనదారులు రోడ్డు నియమాలు, నిబంధనలను పాటించడం లేదు. ఫలితంగా జనవరి 15 నుంచి 21వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లోనే రాచకొండ ట్రాఫిక్ పోలీసులు 39 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ట్రాఫిక్ ఉల్లంఘనదారులపై మొత్తం రూ.1.70 కోట్ల జరిమానా విధించారు. వారం వ్యవధిలో 78 రోడ్డు ప్రమాదాలు జరగగా 22 మంది ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం తాగి వాహనాలు నడపడం వంటి పెద్ద మానవ తప్పిదాలే కారణమని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల వివరాల ప్రకారం.. ఉల్లంఘనల కోసం నగరం అంతటా నిర్వహించిన వివిధ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా, మొత్తం 39,858 మోటార్ వెహికల్ యాక్ట్ కేసులు వివిధ హెడ్‌ల కింద బుక్ అయ్యాయి. రూ.1,75,58,415 జరిమానాలు విధించబడ్డాయి.

మద్యం తాగి వాహనాలు నడిపే వారిని అరికట్టేందుకు ట్రాఫిక్ విభాగం ఏడు కేసులు నమోదు చేసిందని, ట్రాఫిక్ ఉల్లంఘించిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనం నడిపినందుకు గానూ 118 మందిని కోర్టులో హాజరుపరచగా, మొత్తం రూ.3.40 లక్షల జరిమానా, ఒకరికి జైలుశిక్ష విధించారు. గత వారంలో మొత్తం 78 రోడ్డు ప్రమాదాలు జరగగా, 22 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. మానవ తప్పిదాలు, రోడ్డు ఇంజినీరింగ్ లోపాల వల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడపడం, స్కిడ్డింగ్ వంటి వాటి వల్లే జరుగుతున్నాయని రాచకొండ ట్రాఫిక్ పోలీస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఇంటర్‌ డిపార్ట్ మెంట్‌ అధికారులతో పాటు ట్రాఫిక్‌ ఇంజినీరింగ్‌ సెల్‌ సిబ్బంది ఇటీవల ఘోర ప్రమాద స్థలాలను సందర్శించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అధ్యయనం చేశారు. “ట్రాఫిక్ ఇంజినీరింగ్ సెల్ సిబ్బంది బ్లాక్ స్పాట్‌లను సరిదిద్దడానికి సూచనలను నిరంతరం సమన్వయం చేసి పర్యవేక్షిస్తున్నారు. అంతే కాకుండా భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నారు. డ్రంకెన్ డ్రైవింగ్ స్పెషల్ డ్రైవ్‌ల సమయంలో పర్యవేక్షణ కొరవడటం వల్ల కూడా ప్రమాదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

Exit mobile version