తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా నిలిచే మరో గొప్ప ప్రాజెక్టు ఔటర్ రింగ్ రైలు (Outer Ring Rail) రూపుదిద్దుకుంటోంది. దేశంలోనే ఇదే తొలి ప్రాజెక్టుగా నిలవనుంది. మొత్తం 392 కిలోమీటర్ల పొడవుతో డిజైన్ చేసిన ఈ రైలు మార్గం తెలంగాణలోని 8 జిల్లాల పరిధిలో రానుంది. వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 14 మండలాలను ఈ ప్రాజెక్టు కలుపుతుంది. దక్షిణ మధ్య రైల్వే ఈ ప్రాజెక్టుకు రూ. 12 వేల కోట్ల వ్యయంతో సిద్ధమవుతోంది. ఇప్పటికే దానికి సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మొదట్లో ఈ ప్రాజెక్టు కోసం 508 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించినా, రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంగా ఉండేలా చివరికి 392 కిలోమీటర్ల అట్టిపెట్టిన అలైన్‌మెంట్‌ను ఎంపిక చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల సూచనల మేరకు దక్షిణ మధ్య రైల్వే మార్గాన్ని సవరించింది. గత ప్రణాళికతో పోలిస్తే దాదాపు 120 కిలోమీటర్లు తగ్గించడంతో పాటు, అభివృద్ధి చెందే ప్రాంతాలపై దృష్టి పెట్టింది.
KTR About Hindi : హిందీ భాష పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
ఈ ప్రాజెక్టులో విశేషంగా 6 చోట్ల “రైల్ ఓవర్ రైల్” వంతెనలు నిర్మించనున్నారు. వలిగొండ, గజ్వేల్, బూర్గుల, మాసాయిపేట వంటి ప్రాంతాల్లో ఉన్న ప్రధాన existing రైల్వే మార్గాలపై కొత్త లైన్లు పైకిపైగా ఫ్లైఓవర్‌లా నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డుకు కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోనే ఈ ప్రాజెక్టు వెళ్లనుంది. దీంతో రహదారి, రైలు మార్గాలు సమాంతరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి కొత్త దారులు తెరుచుకుంటాయి. కొత్తగా వచ్చే 26 రైల్వే స్టేషన్లు ప్రజలకు మెరుగైన కనెక్టివిటీని కల్పిస్తాయి. బస్సులు, మెట్రో, రైలు మార్గాల మధ్య మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ ఏర్పడటంతో ప్రయాణదూరాలు తగ్గుతాయి. ప్రయివేట్ వాహనాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గి, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇది ఉపకరిస్తుంది. ముఖ్యంగా కనెక్టివిటీ లేని శివారు ప్రాంతాల్లో అభివృద్ధికి ఈ ప్రాజెక్టు మైలురాయిగా మారనుందని తెలంగాణ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.