Site icon HashtagU Telugu

Telangana: కాంగ్రెస్ మేనిఫెస్టోని దగ్ధం చేసిన ఓయూ నిరుద్యోగులు

Telangana

Telangana

Telangana: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటానికి అసలు కారణం యువత, విద్యార్థులు. తమ బంగారు భవిష్యత్తు కోసం ప్రాణాలు లెక్కచేయకుండా వారు రోడ్డెక్కారు, ఆందోళనలు, ఉద్యమాలు చేశారు, ప్రాణ త్యాగాలు చేశారు.. ఎన్నో చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు. తీరా రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు రావట్లేదని ఆవేదన చెందుతున్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇస్తారనుకుంటే అదీ జరిగేలా లేదు.

ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు . కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీలను నిరుద్యోగులు దగ్ధం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టి 15 రోజులకే నిరుద్యోగులను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్వేతపత్రం విడుదల చేయకుంటే ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మాన్వతారాయ్ హెచ్చరించారు. రెండు నెలల్లో 4000 నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నియామకాల కోసం పోరాటం చేస్తామన్నారు.

తాము నిరుద్యోగ భృతి గురించి ఎన్నిక‌ల్లో ఎక్క‌డా హామీ ఇవ్వ‌లేద‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారని, కానీ నిరుద్యోగ భృతి గురించి వారి ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌స్తావించార‌ని, ప్రియాంక గాంధీ కూడా ఓ స‌భ‌లో వ్యాఖ్యానించార‌ని నిరుద్యోగులు గుర్తు చేశారు. ఈ రెండు అంశాల‌కు సంబంధించిన ఆధారాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయ‌ని తెలిపారు.

Also Read: Bigg Boss: బిగ్ బాస్ దాడి ఘటనలో 16 మంది అరెస్ట్

Exit mobile version