Srinivas Goud: హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కార్యాలయంలోని ఫర్నీచర్ , కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్తున్న వారిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకులు, ఇతర విద్యార్థులు అడ్డుకున్నారు. రెండు ట్రాలీల్లో ఫర్నీచర్, కంప్యూటర్లు, ఇతర వస్తువులను తీసుకెళ్లే ప్రయత్నం చేయగా.. ప్రభుత్వానికి సంబంధించిన సరుకులు ఎలా తరలిస్తారంటూ విద్యార్థులు నిరసనకు దిగారు. ట్రాలీలను అడ్డుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ మనుషులు సామాగ్రిని అక్రమంగా తరలిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఆపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లోడ్‌లో ఏసీ, ఫర్నీచర్, కంప్యూటర్లు, అనేక ఫైళ్లు తరలించినట్లు విద్యార్థులు గుర్తించారు.
Also Read: Lemon for skin: నిమ్మరసంలో అది కలిపి రాస్తే చాలు మీ ముఖం ప్రశాంతంగా వెలిగిపోవాల్సిందే?