Operation NTR Statue : BRS కు జూనియ‌ర్ క్రేజ్! రేవంత్, T-TDPకి బ్రేక్!

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను (Operation NTR Statue ) సానుకూలంగా మ‌ల‌చుకునే ప్ర‌య‌త్నం బీఆర్ఎస్ (BRS) చేస్తోంది.

  • Written By:
  • Updated On - May 4, 2023 / 12:15 PM IST

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను (Operation NTR Statue ) సానుకూలంగా మ‌ల‌చుకునే ప్ర‌య‌త్నం బీఆర్ఎస్ (BRS) చేస్తోంది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత మునుపెన్న‌డూ లేనివిధంగా ఎన్టీఆర్ మీద ఆ పార్టీ నేత‌లు అభిమానాన్ని చాటుతున్నారు. జ‌యంతి, వ‌ర్థంతి వేడుక‌ల సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు క్యూ క‌డుతున్నారు. ఎన్టీఆర్ విగ్ర‌హాల‌ను పోటీప‌డి ఆవిష్క‌రించ‌డానికి ముందుకొస్తున్నారు. అందుకు రాజ‌కీయ కార‌ణాలు లేక‌పోలేదు.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ చ‌రిష్మాను సానుకూలంగా ప్ర‌య‌త్నం  (Operation NTR Statue ) 

ఇటీవ‌ల ఐప్యాక్ చేసిన స‌ర్వేలో ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) బ‌ల‌హీనంగా ఉంద‌ని తేలింద‌ట‌. ప్ర‌త్యేకించి ఖ‌మ్మం, న‌ల్గొండ‌, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ ఖాతా తెరిచే ప‌రిస్థితి లేద‌న్న షాకింగ్ న్యూస్ ఆ వ‌ర్గాల‌ను అల‌జ‌డికి గురి చేస్తోంది. అందుకే, క‌నీసం 30 నుంచి 40 మంది సిట్టింగ్ ల‌ను మార్చేస్తానంటూ కేసీఆర్ (KCR) సంకేతాలు ఇచ్చేశారు. ఆ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రాబ‌ల్యం పెంచుకోవ‌డానికి ఉండే మార్గాల‌ను కేసీఆర్ అన్వేషించ‌గా, ఎన్టీఆర్ చ‌రిష్మా ప‌నిచేస్తుంద‌ని తెలుసుకున్నార‌ట‌. అందుకే, ఎన్టీఆర్ మీద అభిమానాన్ని చాటుతూ ఖ‌మ్మం వేదిక‌గా విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ చేయ‌బోతున్నారు.

ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నాలుగు జిల్లాల్లో టీడీపీ ఛాయ‌లు చాప‌కింద‌నీరులా బ‌లంగా ఉన్నాయ‌ని స‌ర్వే తేల్చింది. ఆ ఓటు బ్యాంకు ఇప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి వైపు మళ్లింద‌ని తేలింది. అంతే, ఎన్టీఆర్ చ‌రిష్మా (Operation NTR Statue) బీఆర్ఎస్ కు క‌నిపించింది. దానికి సాన‌పెడుతూ జూనియ‌ర్ ఎన్టీఆర్ కు కూడా బీఆర్ఎస్ వ‌ల‌వేసింది. అన్న ఎన్టీఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు రావాల‌ని మంత్రి పువ్వాడ అజ‌య్(puvvada ajay) ఆహ్వానం అందించారు. ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా జూనియ‌ర్ ఎన్టీఆర్ (Junior NTR) ను ఫోక‌స్ చేయ‌డం ద్వారా రేవంత్ వైపు మ‌ళ్లిన టీడీపీ ఓటు బ్యాంకును బీఆర్ఎస్ వైపు తిప్పుకోవాల‌ని మాస్ట‌ర్ స్కెచ్ కేసీఆర్ వేశారని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌.

జూనియ‌ర్ ఎన్టీఆర్, రేవంత్ రెడ్డి మ‌ధ్యా స్నేహ‌బంధం

జూనియ‌ర్ ఎన్టీఆర్, రేవంత్ రెడ్డి(Revanth Reddy) మ‌ధ్యా స్నేహ‌బంధం కూడా ఉంది. ఉమ్మ‌డి ఏపీలో బ‌స్సు యాత్ర ద్వారా జూనియ‌ర్ ప్ర‌చారానికి వెళ్లిన‌ప్పుడు అన్నీతానై రేవంత్ చూసుకున్నారు. స్పీచ్ ల నుంచి రోడ్ మ్యాప్ ను అమ‌లు చేసే బాధ్య‌త‌ను అప్ప‌ట్లో రేవంత్ కు అప్పగించారు. ఆనాడు ఏర్ప‌డిన సాన్నిహిత్యం రేవంత్, జూనియ‌ర్(Junior NTR) మ‌ధ్య కొన‌సాగుతోంది. అందుకే, జూనియ‌ర్ భుజం మీద తుపాకీ పెట్టి అటు రేవంత్ ఇటు టీడీపీ తెలంగాణ విభాగాన్ని స్మాష్ చేయాల‌ని బీఆర్ఎస్ వేసిన ఎత్తుగ‌డ‌. దానిలో భాగంగా జూనియ‌ర్ కు ప్ర‌త్యేకంగా ఆహ్వానం ఇవ్వ‌డం స‌రికొత్త రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది.

Also Read : Junior : చంద్ర‌బాబుపై `జూనియ‌ర్` అస్త్రం! వైసీపీ త‌ర‌హాలో బీఆర్ఎస్ ఎత్తుగ‌డ‌!

మ‌హానాడు ప్ర‌తి ఏడాది మే 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు టీడీపీ(TDP) నిర్వ‌హిస్తోంది. అన్న ఎన్టీఆర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ వేడుక‌లు జ‌రుపుకుంటారు. పార్టీల‌కు అతీతంగా తెలుగువాళ్లు సెల‌బ్రేట్ చేసుకునే పండుగ‌లా ఆ వేడుక ఉంటుంది. కొన్ని ద‌శాబ్దాలుగా నిర్వ‌హిస్తోన్న మ‌హానాడుకు దేశ విదేశాల నుంచి తెలుగు ప్ర‌జలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తారు. ఈసారి ఆ వేడుక‌ల్ని మే 27, 28 తేదీల్లో రెండో రోజుల పాటు రాజమండ్రి కేంద్రంగా టీడీపీ నిర్వ‌హిస్తోంది. అందుకు సంబంధించిన భారీ ఏర్పాట్ల‌ను కూడా చేస్తోంది. స‌రిగ్గా అదే తేదీన (మే 28న‌) ఖ‌మ్మం వేదిక‌గా ఎన్టీఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ (Operation NTR Statue) కార్య‌క్ర‌మాన్ని బీఆర్ఎస్ ఫిక్స్ చేసింది.

Also Read : BRS Plenary: బీఆర్ఎస్ ప్లీనరీ తీర్మానాలు, జాతీయ రాజకీయాలే లక్ష్యం!

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు జూనియ‌ర్ (Junior NTR) దూరంగా ఉంటున్నారు. మ‌హానాడుకు ఆహ్వానం కూడా పార్టీ ఆయ‌న‌కు పంప‌డంలేదు. అదేమంటే, అంద‌రూ ఆహ్వానితులే అంటూ టీడీపీ చెబుతోంది. నంద‌మూరి కుటుంబం మ‌హానాడు వేదిక మీద క‌నిపిస్తుంది. కానీ, జూనియ‌ర్ గ‌త కొన్నేళ్లుగా ఆ వేదిక‌ను పంచుకోవ‌డంలేదు. ఈసారి కూడా రాజ‌మండ్రిలో జ‌రిగే మ‌హానాడుకు ఆహ్వానం పంపే అవ‌కాశం లేదు. ఆయ‌న హాజరు అయ్యే ఛాన్స్ కూడా క‌నిపించ‌డంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్న ఎన్టీఆర్, జూనియ‌ర్ ఎన్టీఆర్ ల‌కు ఉండే క్రేజ్ ను సొంతం చేసుకోవ‌డానికి బీఆర్ఎస్ మాస్ట‌ర్ స్కెచ్ వేసింది. దీంతో ఒక దెబ్బ‌కు రెండు పిట్ట‌ల్లా అటు రేవంత్ ఇటు టీడీపీ తెలంగాణ విభాగాన్ని బ‌ల‌హీన‌ప‌ర‌చాల‌ని బీఆర్ఎస్ చూస్తోంది. వాళ్ల ప్లాన్ కు అనుగుణంగా జూనియ‌ర్ న‌డుచుకుంటారా? ఖ‌మ్మం లో జ‌రిగే ఎన్టీఆర్ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ‌కు (Operation NTR Statue) వెళ‌తారా? అనేది ప్ర‌స్తుతానికి సందిగ్ధమే!