Operation Kammam : తుమ్మ‌ల‌కు మూడు పార్టీల ఆఫ‌ర్ ! తేల్చుకోవ‌డానికి ఆత్మీయ ర్యాలీ!!

మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Operation Kammam) భవిష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యాణంపై ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు.

  • Written By:
  • Updated On - August 25, 2023 / 03:56 PM IST

మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు (Operation Kammam) భవిష్య‌త్ రాజ‌కీయ ప్ర‌యాణంపై ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తున్న‌ప్ప‌టికీ ధైర్యం చేయలేక‌పోతున్నారు. మ‌రో వైపు బీజేపీ గాలం వేస్తున్న‌ప్పటికీ ప‌డేందుకు సిద్ధంగా లేరు. చౌర‌స్తాలో ఉన్న ఆయ‌న రాజ‌కీయానికి ఫైన‌ల్ ట‌చ్ ఇవ్వ‌డానికి క్యాడ‌ర్ సిద్ద‌మ‌యింది. హైద‌రాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో తుమ్మల నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లాకు వెళ్లారు. అక్క‌డ ఆత్మీయుల‌తో క‌లిసి ఒక నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తోంది.

హైద‌రాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో  ఖ‌మ్మం జిల్లాకు తుమ్మల(Operation Kammam) 

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మెచ్చిన లీడ‌ర్ తుమ్మల నాగేశ్వ‌ర‌రావు. అందుకే, ఆయ‌న గెలిచిన వెంట‌నే మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు ఎన్టీఆర్. పార్టీ పెట్టిన 1983లో స‌త్తుప‌ల్లి నుంచి పోటీ చేసే అవ‌కాశం ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆయ‌న‌కు తిరిగి 1985లో జ‌రిగిన మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లో పోటీ చేసే అవ‌కాశం ఇచ్చారు. ఆ ఎన్నిక‌ల్లో గెలుపొందిన నాగేశ్వ‌ర‌రావును మంత్రివ‌ర్గంలోకి ఎన్టీఆర్ తీసుకున్నారు. ఆ రోజు నుంచి ఆయ‌న రాజ‌కీయంగా తిరిగి చూడ‌లేదు. ఆత్మీయుల‌ను ఎప్పుడూ ప్రేమ‌గా చూసే నాగేశ్వ‌ర‌రావు రాజ‌కీయంగా సుదీర్ఘ ప్ర‌యాణం (Operation Kammam) సాఫీగానే సాగింది. రాష్ట్రం విడిపోయిన త‌రువాత రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు.

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మెచ్చిన లీడ‌ర్ తుమ్మల నాగేశ్వ‌ర‌రావు

ఉమ్మ‌డి ఏపీలో జ‌రిగిన 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఆయ‌న ఆ త‌రువాత జ‌రిగిన 2009 ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి ఓడిపోయారు. ఆ త‌రువాత 2015లో టీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ మంత్రివ‌ర్గంలోకి తీసుకున్నారు. వెంట‌నే జ‌రిగిన 2016 ఎన్నిక‌ల్లో ఆయ‌న పాలేరు నుంచి గెలిచారు. అయితే, 2018 ఎన్నిక‌ల్లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఓడిపోయారు. అప్ప‌టి నుంచి నాగేశ్వ‌ర‌రావును సీఎం కేసీఆర్ దూరం పెడుతూ వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ ఆ పార్టీలో(Operation Kammam) కొన‌సాగుతూ వచ్చారు.

ఖ‌మ్మం రాజ‌కీయం మ‌లుపు

సాధారంగా ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా నాగేశ్వ‌ర‌రావు సామాజిక‌వ‌ర్గం హ‌వా ఉండేది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ వ్యాప్తంగా బ‌ల‌హీన‌ప‌డిన త‌రువాత తుమ్మ‌ల ప్ర‌స్తానం త‌గ్గుతూ వ‌చ్చింది. దాన్నే అదునుగా చూసుకుని కేసీఆర్ రాజ‌కీయంగా తుమ్మ‌ల‌ను కార్న‌ర్ చేశార‌ని ఆయ‌న అభిమానుల అనుమానం. అందుకే, బీఆర్ఎస్ పార్టీని ఖ‌మ్మంలో లేకుండా చేయడానికి సిద్ధ‌మ‌వ్వాల‌ని తుమ్మ‌ల వ‌ర్గీయుల ప‌ట్టుద‌ల‌. ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నారు. కానీ, పాలేరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసే అవ‌కాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప‌రిస్థితి లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థిగా ఉండే పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి హ‌వా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతోంది. ఆయ‌న్ను కాద‌ని పాలేరు నుంచి టిక్కెట్ కాంగ్రెస్ ఇస్తుందా?  (Operation Kammam) అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవుతోంది.

Also Read : BRS Party: ఎర్రబెల్లి ఆకర్ష్, బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయ‌డానికి కాంగ్రెస్ పార్టీతో షర్మిల మంత‌నాలు సాగిస్తున్నారు. ఆ ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. ఆమె మూడు స్థానాల‌ను డిమాండ్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. న‌ల్గొండ జిల్లా తంగ‌తుర్తి, ఖ‌మ్మం జిల్లా పాలేరు మ‌రోచోట టిక్కెట్ల‌ను ఆశిస్తున్నారు. ఆ మేర‌కు ఒప్పందం కుదిరితే, ఆమెకు ఆ స్థానాలు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు ఖ‌మ్మం జిల్లా వ్యాప్తంగా ఎక్క‌డ స్థానం ఉంది? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా పాలేరు నుంచి పోటీ చేయ‌డం ఆయ‌న‌కు ఉన్న మొద‌టి ఆప్ష‌న్. పార్టీ బ‌లంగా లేన‌ప్ప‌టికీ బీజేపీలో చేరి పాలేరు నుంచి పోటీకి దిగ‌డం రెండో ఆప్ష‌న్. రాజ్య‌స‌భ వ‌చ్చే మార్చిలో ఇస్తామ‌ని బీఆర్ఎస్ ఇస్తోన్న హామీని న‌మ్ముకుని ఆ పార్టీ గెలుపు కోసం ప్ర‌య‌త్నం చేయ‌డం మూడో ఆప్ష‌న్‌. ఈ మూడింటిలో దేన్ని ఎంచుకోవాలి? అనేదానిపై చ‌ర్చించ‌డానికి ఆత్మీయుల‌ను క‌ల‌వ‌డానికి హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం వెళ్లారు.

Also Read : BRS list strategy : KCR వ్యూహాల‌కు అర్థాలు వేరు.!

రెండు రోజులు క్రితం ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ద్వారా కేసీఆర్ రాయ‌భారం తుమ్మ‌ల‌కు పంపారు. రాజ్య‌స‌భ ఆఫర్ ను ఆయ‌న ముందు ఉంచిన‌ట్టు తెలుస్తోంది. కానీ, కేసీఆర్ ను మాట‌ల‌ను విశ్వ‌సించ‌లేని ప‌రిస్థితుల్లో తుమ్మ‌ల వ‌ర్గీయులు ఉన్నారు. గ‌త నాలుగేళ్లుగా త‌మ్ముల‌ను ప‌ట్టించుకోకుండా కేసీఆర్ నిర్ల‌క్ష్యం చేశారు. అంతేకాదు, ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను ప్రోత్స‌హిస్తూ రాజ‌కీయంగా నిర్వీర్యం చేస్తున్నార‌ని తుమ్మ‌ల ఆత్మీయుల్లో ఉంది. ఒక వేళ రాజ్య‌స‌భ‌కు వెళ్లిన్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో ప‌ట్టు ఉండ‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న తీసుకునే నిర్ణ‌యంపై ఖ‌మ్మం రాజ‌కీయం మ‌లుపు తిర‌గ‌నుంది.