Site icon HashtagU Telugu

Mission 12: మిషన్ 12 పై ‘బండి’ఆపరేషన్

తెలంగాణ లోని 12 ఎస్టీ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా ఆపరేషన్ మొదలు పెట్టింది. దానికి సంబంధించిన వివరాలను బండి సంజయ్ వెల్లడించాడు. అవి ఇలా…

12 ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ కే గెలుపు అవకాశాలు ఉన్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ బండి సంజయ్ కుమార్, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ తో పాటు 12 నియోజకవర్గాల నాయకులు, రాష్ట్ర ఎస్టీ మోర్చా నాయకులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

కేసీఆర్ గిరిజనులకు చేస్తున్న అన్యాయం పై పోరాడే సత్తా కేవలం బీజేపీ కి మాత్రమే ఉందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ సర్కార్ గిరిజనులకు తీరని ద్రోహం చేసిందని ఆయన అన్నారు. గుర్రంపొడు భూముల బాధిత గిరిజనుల తరపున, అసిఫాబాద్ లో పొడు రైతుల బీజేపీ పోరాడిందని సంజయ్ చెప్పారు. రాష్ట్రం లో బీజేపీయే తమ భరోసా అని గిరిజనులు భావిస్తున్నారని ఆయన అన్నారు.

12 ఎస్టీ నియోజకవర్గాల్లో ఎస్టీ లతో పాటు గిరిజనేతరులను కలుపుకుని పోయే విధంగా కార్య క్రమాలు రూపొందించాలని సంజయ్ చెప్పారు. గిరిజన రిజర్వుడు నియోజకవర్గాల్లో పార్టీ ని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నాయకులకు సూచించారు త్వరలో మిషన్ 12 -ఎస్టీ నియోజకవర్గ మూల సమన్వయ కమిటీ పర్యటిస్తుందని సంజయ్ చెప్పారు.

Exit mobile version