Telangana Ministers : ఖమ్మం నుంచి ఆ ఇద్దరిలో ఒక్కరికే మంత్రి ఛాన్స్ ?!

Telangana Ministers : సీఎం సీటు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఖాయం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ మంత్రివర్గ  కూర్పుపైకి మళ్లింది.

Published By: HashtagU Telugu Desk
Telangana Ministers

Telangana Ministers

Telangana Ministers : సీఎం సీటు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డికి ఖాయం కావడంతో ఇప్పుడు అందరి ఫోకస్ మంత్రివర్గ  కూర్పుపైకి మళ్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే డిబేట్ నడుస్తోంది. సీఎం సీటు కోసం చివరి వరకు ప్రయత్నించిన నాయకుల్లో ఒకరైన మల్లు భట్టివిక్రమార్క ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే వస్తారు. సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడివారే. బీఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్‌లు విసిరిన ముఖ్య కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ జిల్లా నాయకుడే. ఈవిధంగా హేమాహేమీలకు, రాజకీయ దిగ్గజాలకు నెలవైన ఖమ్మం నుంచి మంత్రివర్గంలో ఎవరికి ఏ బెర్తు దక్కుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

We’re now on WhatsApp. Click to Join.

  • మధిర నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన మల్లు భట్టివిక్రమార్కకు మంత్రివర్గంలో కీలక స్థానం దక్కే అవకాశం ఉంది. గతంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. దళిత సామాజికవర్గానికి చెందిన ముఖ్యనేత కావటం మల్లు భట్టివిక్రమార్కకు  ప్లస్ పాయింట్.
  • ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్‌, చంద్రబాబు, కేసీఆర్‌ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేశారు. రేవంత్‌రెడ్డి ఆహ్వానంతో కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌పై గెలిచారు.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలవడంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించారు. మంత్రి పదవి రేసులో ఆయన కూడా ఉన్నారు. శాసనసభ ఎన్నికల బరిలో తొలిసారి నిలిచిన పొంగులేటి.. పాలేరు నుంచి భారీ మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ పెద్దలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఖమ్మంలోని  తన అనుచరులందరినీ గెలిపించుకోవటం ఆయనకు ప్లస్ పాయింట్.
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మూడు మంత్రి పదవులు దక్కుతాయా ? లేదా ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పొంగులేటి, తుమ్మలలో ఒక్కరికే మంత్రియోగం దక్కితే  మరొకరు త్యాగం చేయాల్సి వస్తుందనే వాదన(Telangana Ministers) వినిపిస్తోంది.

Also Read: PM Kisan – Hike : ‘పీఎం కిసాన్’ సాయాన్ని పెంచబోతున్నారా ? కేంద్రం క్లారిటీ

  Last Updated: 06 Dec 2023, 09:28 AM IST