తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంటున్న ( One Year Of Congress Ruling) సందర్బంగా కాంగ్రీ ప్రభుత్వం ప్రజాపాలన ఉత్సవాలు జరుపుతుంది. రేపు డిసెంబర్ 01 నుండి డిసెంబర్ 09 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ తరుణంలో సీఎం రేవంత్ కీలక ట్వీట్ చేశారు. ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు… పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడని ..ఆ ఓటు అభయహస్తమై…రైతన్న చరిత్రను తిరగరాసిందని పేర్కొన్నారు.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులపై దృష్టి సాధించిన సంగతి తెలిసిందే ఏడాదిలోపు మూడు విడతలుగా రైతుల రుణమాఫీ చేసిన ప్రభుత్వం, ఈసారి నాలుగో విడతకు శ్రీకారం చుట్టింది. ఈ నాల్గో విడతలో మూడు లక్షల మందికి రుణమాఫీ చేయనుంది. తొలి విడత 11 లక్షల 34 వేల 412 మందికి లక్ష వరకు రుణమాఫీ చేసింది. రెండో విడతలో మరో ఆరున్నర లక్షల మందికి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేసింది. మూడో విడతలో నాలుగున్నర లక్షల మందికి 2 లక్షల వరకు చేసింది. ఒక్క ఏడాదిలో రైతులకు దాదాపు 54 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది రేవంత్ సర్కార్. అందులో రైతు పెట్టుబడి సహాయం కింద 7,625 కోట్లు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కింద 10,444 కోట్లు ఉన్నాయి.
ఇక ధాన్యం కొనుగోలు కోసం 10, 547 కోట్ల రూపాయలు, వరదల వల్ల పంట నష్టం కింద ఎకరాకి 10 వేలు చొప్పున ఆర్థిక సాయం చేసింది. తెలంగాణలో 42 లక్షల మంది రైతులకు భీమా కవరేజ్ నిమిత్తం 1433 కోట్ల రూపాయలను ప్రీమియం కింద చెల్లింపు చేసింది. ఇవికాకుండా పచ్చి రొట్టె ఎరువు తయారీ, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు చెల్లింపులు, మార్క్ ఫెడ్ ద్వారా ధాన్యం సేకరణ, వ్యవసాయ సంబంధిత నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు, హార్టికల్చర్, ఆయిల్ పామ్ సాగు సబ్సిడీ, వ్యవసాయ మార్కెట్ యార్డుల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది.
ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు…
పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు…
పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు.
ఆ ఓటు అభయహస్తమై…
రైతన్న చరిత్రను తిరగరాసింది.ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ…
రూ.7,625 కోట్ల రైతు భరోసా…
ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్…
రూ.10,444 కోట్ల ఉచిత…— Revanth Reddy (@revanth_anumula) November 30, 2024
Read Also : BRS : బీఆర్‌ఎస్ దీక్షా దివస్.. ఒక్కటి మిస్సయ్యింది ‘పుష్ప’…