Site icon HashtagU Telugu

One Nation No Election : బీజేపీ బోణీపై కేటీఆర్ రియాక్షన్.. ‘వన్ నేషన్ నో ఎలక్షన్’ ట్వీట్

KTR Fire On Congress

For the Congress party, politics is more important than the benefit of the farmers: KTR

One Nation No Election : బీజేపీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘వన్ నేషన్ – నో ఎలక్షన్.. వెల్ డన్ ఈసీఐ’ అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానంలో బీజేపీ గెలిచిందని తెలిపే న్యూస్ క్లిప్‌ను తన ట్వీట్‌కు కేటీఆర్  జతపరిచారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ అనే నినాదంతో బీజేపీ ముందుకు పోతోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే.. వచ్చేసారి దేశంలో జమిలి  ఎన్నికలు  నిర్వహించే ప్లానులో బీజేపీ ఉంది. అంటే.. గ్రామ పంచాయతీ నుంచి లోక్‌సభ దాకా అన్ని చోట్లా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. 2029 ఎన్నికల్లో ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ (One Nation No Election) విధానాన్ని అమలు చేయాలనే పట్టుదలతో ప్రధాని మోడీ ఉన్నారు. దీనివల్ల దేశ ఖజానాకు చాలా డబ్బు ఆదా అవుతుందని బీజేపీ వాదిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ఈనేపథ్యంలో  తాజాగా గుజరాత్‌లోని సూరత్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆశ్చర్యకరంగా ఇక్కడి నుంచి ఇద్దరు కాంగ్రెస్ నేతలు నామినేషన్లు వేసినా ఎన్నికల రిటర్నింగ్ అధికారి రెజెక్ట్ చేశారు. బీఎస్పీ అభ్యర్థి  బరిలో మిగిలినా.. ఆదివారం రాత్రికి రాత్రి ఆయన కూడా నిర్ణయం మార్చేసుకొని ఈ సీటును బీజేపీకి త్యాగం చేసి పోటీ నుంచి తప్పుకున్నారు. మరో ఏడుగురు చిన్నాచితక అభ్యర్థులు కూడా నామినేషన్లను ఉపసంహరించుకొని బీజేపీ అభ్యర్థికి లైన్ క్లియర్ చేశారు. ఈవిధంగా నాటకీయ పరిణామాల నడుమ సూరత్‌లో బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది. అందుకే కేటీఆర్ తన ట్వీట్‌లో ‘వన్ నేషన్ – నో ఎలక్షన్.. వెల్ డన్ ఈసీఐ’ అనే ప్రస్తావనను తీసుకొచ్చారు. అకస్మాత్తుగా బీఎస్పీ లాంటి జాతీయ పార్టీ అభ్యర్థి కూడా సూరత్‌లో నామినేషన్ వాపసు తీసుకుంటుంటే.. కేంద్ర ఎన్నికల సంఘం చూస్తూ కూర్చుండిపోయిందనే భావనను కేటీఆర్ తన ట్వీటులో వ్యక్తపరిచారు.

Also Read :80 Earthquakes : 80 సార్లు కంపించిన భూమి.. పేకమేడల్లా కూలిన భవనాలు.. ఎక్కడంటే ?

ఇవాళ వరంగల్‌లో కేటీఆర్ ప్రచారం

ఇక కేటీఆర్ ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. హంటర్ రోడ్డులోని డి.కన్వెన్షన్ లో జరిగే బీఆర్ఎస్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జరిగే వరంగల్ తూర్పు కార్యకర్త సమావేశానికి హాజరవుతారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణపై పోరాటం చేస్తామని ఈ కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. వరంగల్‌లో కేసీఆర్ చొరవతో ఏర్పాటైన టెక్స్ టైల్ పార్కు గురించి ప్రజలకు వివరించనున్నారు.

Also Read :Cool Foods : చలువ‘ధనం’ కావాలా ? పోషక బలం కావాలా ?