Site icon HashtagU Telugu

TSRTC : సంక్రాంతికి కోటి 20 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికులను గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిన టీఎస్ఆర్టీసీ

Telangana RTC

Tsrtc

జనవరి 11 నుంచి 14 వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కోటీ 20 ల‌క్ష‌ల మంది ప్రయాణికులను త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేర్చిందని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్రం నుండి కోటి మంది ప్రయాణికులు జిల్లాల మీదుగా వెళ్లి..తిరిగి రావడానికి బస్సు సేవలను ఉపయోగించారని తెలిపారు. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి TSRTC 3203 ప్రత్యేక బస్సులను నడిపిందని..వివిధ ప్రాంతాల నుండి తిరిగి నగరానికి చేరుకోవడానికి మరో 3000 బస్సులను ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ తెలిపారు. గత సంక్రాంతి సీజన్‌తో పోలిస్తే టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో ఐదు లక్షల మంది ఎక్కువ మంది ప్రయాణించారని స‌జ్జ‌నార్ తెలిపారు. టీఎస్ఆర్టీసీపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందన్నారు. కార్పొరేషన్ టోల్ ప్లాజా వద్ద TSRTC బస్సుల కోసం ప్రత్యేకమైన లేన్‌లను ఏర్పాటు చేసి వేచి ఉండే సమయాన్ని తగ్గించి.. దాని ప్రయాణ సమయాన్ని విజయవంతంగా మెరుగుపరిచిందని మేనేజింగ్ డైరెక్టర్ స‌జ్జ‌నార్ తెలిపారు, స్వస్థలాల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయ‌న అధికారులను కోరారు.