Site icon HashtagU Telugu

Flexi controversy : ఖమ్మం TRSలో వర్గపోరు…ఫ్లెక్సీలో ఫొటో లేదని అధికారులపై గుస్సా..!!

Khammam Flexi

Khammam Flexi

ఖమ్మం జిల్లా TRSలో వర్గపోరు మరోసారి బయటపడింది. పాలేరు జలాశయంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమం జరిగింది. దీనికి మత్య్సశాఖ అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమానికి ఎంపీలు నామ నాగేశ్వరరావు, పద్దిరాజు రవిచంద్రతోపాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులపై మండిపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రొటోకాల్ ప్రకారం ఫ్లెక్సీల్లో తమ ఫొటోలు ఎందుకు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదర్ అధికారులపై మండిపడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కేవలం మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఫొటోలు మాత్రమే ఉండటాన్ని జీర్ణించుకోలేని మధుసూధన్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమానికి వచ్చిన వారి ఫొటోలు లేవు…రాని మంత్రి, ఎమ్మెల్యే ఫొటోలు పెట్టమని ఎవరు చెప్పారంటూ…మీరు ఆఫీసర్స్ ఆఫీసర్స్ లాగా ఉండండి..పనికిమాలిన పనలు చేయకండి. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇది జరిగిన కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అధికారులు, అక్కడున్న నాయకులతో కలిసి రిజర్వాయర్ లో చేప పిల్లల్ని వదిలి వెళ్లిపోయారు.

కాగా తెలంగాణ జాతీయ సమైక్యతా ఉత్సవాలలో నేతలు విడివిడిగానే పాల్గొన్నారు. మంత్రి అజయ్ కుమార్ కు జరిగిన పౌర సన్మానం కార్యక్రమంలోనూ ఈ నేతలు ఎవ్వరూ కనిపించలేదు.  పార్టీలో విభేదాలే దీనికి కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Exit mobile version