T Congress : మరోసారి కాంగ్రెస్ లో భగ్గుమన్న అసమ్మతి సెగలు..రేవంత్ ఇంటివద్ద ఉద్రిక్తత

ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరులలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా ఈయన సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
Revanth House

Revanth House

టీ కాంగ్రెస్ (T COngress) లో మరోసారి అసమ్మతి సెగలు మొదలయ్యాయి. సోమవారం అధిష్టానం 16 మందితో కూడిన మూడో విడత అభ్యర్థుల జాబితాను (Congress 3rd List ) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ఎప్పటి నుండో టికెట్ కోసం ఎదురుచూస్తున్న వారికీ టికెట్ రాకపోయేసరికి వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ని నమ్ముకొని ఉన్న మమ్మల్ని కాదని..కొత్తగా వచ్చిన వారికీ టికెట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం రేయి పగలు కష్టపడుతుంది మీము..ఈ పార్టీ కాదని వెళ్లి, మళ్లీ ఎన్నికల సమయానికి పార్టీ లో చేరిన వారికీ టికెట్ ఇవ్వడం ఏంటి..? ఇతర పార్టీ నుండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చిన వారికీ ఇవ్వడం ఏంటి..? అని వారంతా వాపోతూ.. పార్టీ అధినాయకత్వం ఫై మండిపడుతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్, పటాన్ చెరు (Patancheru, Narayankhed)లలో సీట్ల కేటాయింపు విషయమై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ (Damodar Raja Narasimha) అసంతృప్తితో ఉన్నారు. పార్టీని వీడేందుకు కూడా ఈయన సిద్ధం అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నారాయణఖేడ్ నుండి సంజీవరెడ్డి (Sanjeeva Reddy)కి, పటాన్ చెరు నుండి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) కు టిక్కెట్లు కేటాయించాలని కాంగ్రెస్ నాయకత్వానికి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సూచించారు. సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయించాలనే ఉద్దేశ్యంతో దామోదర రాజనర్సింహ సూచించిన వ్యక్తులకు కాకుండా వేరే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. నారాయణఖేడ్ నుండి సురేష్ కుమార్ (SUresh Kumar), పటాన్ చెరు నుండి నీలం మధు (Neelam Madhu)లకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయిస్తూ మూడో లిస్ట్ లో వారి పేర్లను ప్రకటించింది. దీంతో ఎప్పటి నుండో ఈ స్థానాలకు ఎదురుచూస్తున్న సంజీవరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ లకు నిరాశ కు గురయ్యారు. ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్..రేవంత్ ఇంటి వద్దకు వెళ్లి ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తూ..ఆయన ప్లెక్సీ లు , కాంగ్రెస్ జెండాలు కాల్చి విధ్వసం సృష్టించారు. పోలీసులు అక్కడికి చేరుకొని నిరసన కారులను అక్కడినుండి పంపించి..భారీ భద్రతను ఏర్పాటు చేసారు. మరోపక్క కాంగ్రెస్ పెద్దలు దామోదర రాజనర్సింహ తో మాట్లాడేందుకు ట్రై చేస్తున్నారు. మరి దామోదర రాజనర్సింహ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read Also: Recurring Deposit: రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి..? బ్యాంకు, పోస్టాఫీసు RDలలో ఏది బెస్ట్..?

  Last Updated: 07 Nov 2023, 11:38 AM IST