హైదరాబాద్ (Hyderabad) మహానగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిత్యం రద్దీతో ఎప్పుడు కిటకిటలాడే హైదరాబాద్ రోడ్లపై ప్రస్తుతం ఒంటరి మహిళలు, ఆఖరికి చిన్న పిల్లలు కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కామంతో కామందులు రెచ్చిపోతున్నారు.. పగలు రాత్రి అనే తేడా లేకుండా ఒంటరిగా మహిళ కనిపించిన ఆఖరికి అభం శుభం తెలియని చిన్నారి కనిపించిన వారిపై దాడులు (Rape) చేస్తూ వారి కోరికలు తీర్చుకుంటున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో ఘటనలు చోటుచేసుకున్నాయి. కొంతమంది మద్యం మత్తులో అత్యాచారాలకు పాల్పడితే మరికొంతమంది కామంతో అత్యాచారాలు చేయడం చేసారు. కోర్టులు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న..ప్రభుత్వాలు షీ టీం లు ఏర్పాటు చేసి బందోబస్తులు చేస్తున్నప్పటికీ వారు మాత్రం ఆగడంలేదు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఉప్పల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలిక (16 Year Old Girl) బస్సు కోసం ఎదురుచూస్తున్న సమయంలో 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకెళ్తే ఉప్పల్ కి చెందిన బాలిక (16) స్థానిక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతుంది. జనవరి 3న ఉప్పల్ బస్ స్టాప్ లో సదరు బాలిక బస్సు కోసం ఎదురుచూస్తుండగా.. పాతబస్తీకి చెందిన షేక్ సాదక్ (70) అనే వృద్ధుడు ఉప్పల్ బస్టాండ్ ప్రాంతంలోని ఒక కట్టల మిషన్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు వృద్ధుడు..బాలిక దగ్గరికి వెళ్లి మీ అమ్మానాన్న నాకు తెలుసు అని నమ్మించి ఇంటికి వెళ్దాం రమ్మని తీసుకెళ్లాడు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు. బాధిత బాలిక ఇంటికి ఆలస్యంగా చేరుకోవడం ఆమె ముభావంగా ఉండడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి ఏమైందని నిలదీయగా.. అసలు విషయం తల్లికి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు షాక్ కు గురై జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు అత్యాచారానికి పాల్పడిన వృద్ధుని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆడపిల్లలు, యువతలు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలని ఎవరు పిలిచినా వెళ్ళవద్దని తెలిసిన వారైనా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి వెళ్లాలని సూచించారు.
Read Also : Muslim Kar Sevak : ఆ ఇద్దరు ముస్లింలకు అయోధ్య రామమందిరం ఆహ్వానాలు.. ఎందుకంటే..