Lok Sabha Polls : నామినేషన్ వేసేందుకు వచ్చిన అభ్యర్థిని వెనక్కు పంపిన అధికారులు

నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది

  • Written By:
  • Publish Date - April 25, 2024 / 09:32 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజుతో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ వెలువడగా, అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఈరోజు గురువారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల పర్వానికి ఫుల్ స్టాప్ పడింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు 731, 175 అసెంబ్లీ స్థానాలకు 4,210 నామినేషన్లు దాఖలు కాగా.. తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. రేపు వాటిని పరిశీలిస్తారు. ఈనెల 29 వరకు ఉపసంహరణ గడువు ఉండగా.. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న కౌంటింగ్ నిర్వహిస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉండగా నామినేషన్ ప్రక్రియ ముగిసే సమయంలో పెద్దపల్లి జిల్లాలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. దళిత బహుజన పార్టీ అభ్యర్థి మాతంగి హనుమయ్య.. నిమిషం ఆలస్యంగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అధికారులు గేట్లు మూసేశారు. దీంతో లోపలికి పంపించాలని బయట ఉన్న అధికారిని హనుమయ్య బతిమిలాడారు. కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించగా ఆయన వారించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ కు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

Read Also : Virat Kohli: దుమ్మురేపిన కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ లో చారిత్రక రికార్డు,  తొలి ఆటగాడిగా గుర్తింపు!